[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » మందు బాబులకు శుభవార్త – Indion News

మందు బాబులకు శుభవార్త – Indion News

Good News for Drinkers

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది పాత మాట. మరి కొత్తమాట ఏంటి.. మద్యం కూడా ఆరోగ్యానికి మంచే చేస్తుందట.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలిన వాస్తవమిది. ప్రతి రోజు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటే గుండెపోటుతో పాటు అన్ని రకాల స్టోక్స్ దరిదాపులకు కూడా రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 20 వేల మందిపై పరిశోధనలు జరిపిన కేంబ్రిడ్జి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మద్యం ఆరోగ్యానికి మంచిదేనని ధ్రువీకరించారు. రోజుకు మూడు యూనిట్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇస్కామిక్ స్టోక్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఈ పరిశోధనల్లో సుమారు 85 శాతం మందిలో సత్ఫలితాలను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఆరోగ్యానికి మంచిది అని అధిక మొత్తంలో సేవిస్తే మాత్రం ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటే మంచే చేస్తుందన్న మాట …మరి ఇది మందు బాబులకు గుడ్ న్యూసే కదా’

Loading...
[X] Close
Share