[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలుసా…!

జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలుసా…!

How Jagapathi Babu Lost His Property

ఒకప్పుడు జగపతి బాబు టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ రొమాంటిక్ హీరో. శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆంధ్రుల అందగాడు జగపతి బాబు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి లేదు. చదువు అంటే అసలు పడదంట. ఏదైనా నచ్చకపోతే దాని జోలికే వెళ్ళేవాడు కాదు. జగపతి బాబు తండ్రి నిర్మాత కావటంతో కెరీర్ ప్రారంభంలో సొంత బేనర్ లో హీరోగా కొన్ని సినిమాలు చేసాడు.అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవటం వలన కొంత ఆస్థి పోవటమే కాకుండా అంతకు మించి నిరాశకు కూడా గురి అయ్యాడు. ఆ తర్వాత మరల ట్రై చేసి కొన్ని హిట్స్ అందుకొని బాగా సంపాదించినప్పటికీ జల్సారాయుడు కావటం, జూదాలు ఆడటం మరియు అడిగిన వారికి కాదనకుండా డబ్బులు ఇవ్వటం అవి తిరిగి రాకపోవటం….ఇలా ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా ఖర్చు చేయటం, అతిగా దానాలు చేయటం వలన ఉన్న ఆస్తిని నిలబెట్టుకోలేకపోయాడు.
అలా ఆర్ధికంగా చాలా వెనకపడ్డాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో విలన్ గా మారాలనుకున్నాడు. దాంతో అనుకోకుండా ఒక అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అది లెజెండ్ సినిమాలో విలన్ గా చేయటం.ఒక విధంగా ‘లెజెండ్’ సినిమా జగపతి బాబుకి ‘సినీ’ ప్రాణం పోసిందని సినీ పండితులు విశ్లేషిస్తారు. ఇక అక్కడినుంచి వరుసగా విలన్ గా సినిమాలు చేస్తూ ఆర్ధికంగా స్థిరపడ్డాడు. ఇప్పటివరకు జగపతికి సొంత ఇల్లు కూడా లేదట. ఇప్పుడిప్పుడే ఎంతో కొంత వెనకేసుకుంటున్నా…. అని అంటున్నాడు ఈ టాలీవుడ్ స్టైలిష్ విలన్.

Loading...
[X] Close
Share