[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » భారత్-పాక్ ల మధ్య డాలర్ యుద్ధం..!?

భారత్-పాక్ ల మధ్య డాలర్ యుద్ధం..!?

india vs pakistan currency war

భారత్ -పాకిస్థాన్ ల మధ్య సరికొత్త యుద్ధానికి తెరలేచింది. పెద్ద నోట్ల రద్దుతో భారతప్రభుత్వం పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తోంది. దొంగచాటుగా ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పిస్తున్న పాక్ ప్రభుత్వానికి నోట్లరద్దుతో మోడీ అడ్డుకట్టవేశాడు.పాక్ హైకమిషన్  దౌత్యాధికారులపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. డాలర్ల కొరత నేపథ్యంలో  పాక్ దౌత్యాధికారులకు భారత బ్యాంకులు పరిమితులు విధించాయి. పాక్ దౌత్యాధికారులు డాలర్లకు పన్నులేకుండా ఇంతకాలం జీతాలు తీసుకునే వెసులుబాటు ఉండేది. అయితే భారత్ లో  ఇప్పుడు 5 వేల డాలర్లకు మించి విత్ డ్రా చేయాలంటే అందుకు ఖచ్చితంగా కారణాలు చూపిస్తూ.. వాటికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.  5 వేల డాలర్ల కంటే తక్కువ విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదు.  పెద్దనోట్ల రద్దుతో ప్రస్తుతం బ్యాంకుల్లో డాలర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. పాక్ హైకమిషన్ ఉద్యోగులకు సంబంధించిన ఖాతాలు RLB బ్యాంకులో ఉన్నాయి. అందులో నుంచి ఎన్ని డాలర్లు విత్ డ్రా చేయాలన్నా అందుకు సరైన పత్రాలు సమర్పించాలి. లేదంటే ఎక్సేంజ్ రుసుము చెల్లించి భారత కరెన్సీలో జీతాలు తీసుకోవాలి. అంతేకాదు ఎక్సేంజ్ పద్దతిలో తీసుకోవాలన్నా.. కచ్చింతంగా ఆర్బీఐ నియమాలు పాటించాలి. ఇవన్నీ RLB బ్యాంకు పాక్ దౌత్యాధికారులకు సూచించిన నిబంధనలు. ఒకవేళ ఇలా వీలుకాని పక్షంలో తమ డబ్బును పాక్ కు తిరిగి పంపించుకోవాలని RLB బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.అయితే ఈ షరతులు ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పాక్ దౌత్యాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంలో ఉన్న భారత దౌత్యాధికారులకు ఇలాంటి నియమాలనే పెడతామని పాక్ సవాల్ చేస్తోంది.ఇరు దేశాల మధ్య ఇటీవల నెలకొన్న పరిస్థితుల మూలంగానే భారత సర్కార్ ఇలాంటి నిబంధనలను అమలు చేస్తోందని, నోట్ల రద్దు ప్రభావం అంతా బుటకమని పాక్ దౌత్యాధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో సమస్యలు పరిష్కరించడానికి సంబంధిత సంస్థలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద దేశంలో పెద్ద నోట్లరద్దు పాక్ దౌత్యాధికారులకు చుక్కలు చూపిస్తోంది. రద్దు ప్రభావం పాక్ పై అధికంగా ఉంటుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

Loading...
[X] Close
Share