[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » కొబ్బరినూనె తో చచ్చిన శవాన్ని బతికిస్తా…!

కొబ్బరినూనె తో చచ్చిన శవాన్ని బతికిస్తా…!

నగరంలో మోసగాళ్ల ఓ నయా ట్రెండ్ నడుస్తుంది. సామాన్యుల్ని మోసం చేసేందుకు సరికొత్త పంథాను ఎంచుకుంటుంన్నారు కొందరు మోసగాళ్లు. ఒకరు ఎయిడ్స్ ని కొబ్బరినూనెతో తొలగిస్తానంటూ మాయమాటలు చెబుతుంటే, నేనేం తక్కువ తిన్నానా అంటూ మరొ గ్యాంగ్ అదే కొబ్బరినూనె తో ఓ చచ్చిన శవాన్ని బతికించేస్తానంటూ ఊదరగొడుతుంది. ఈ తతంగం చూసే వాళ్లను నమ్మించేందుకు బ్రతికొచ్చిన శవంతో ఇలా నేనింతకముందు చనిపోయా.ఆ కొబ్బరి నూనెవల్ల మళ్లీ బ్రతికొచ్చానంటూ చెప్పిస్తున్నారు. అంతేకాదు కొబ్బరినూనె వేస్తే ఆగిన శ్వాస తిరిగి ప్రారంభమవుతుందట. పోయిన ప్రాణం తిరిగొచ్చిందని ఇలా అమాయకుల్ని మోసం చేస్తున్నారు. కాగా ఈ సినీ డ్రామాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్నవారికి వీరు చేసే మాయ లపై అవగాహన కల్పించాలని..ఎవరు వీరి వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

indion news

Loading...
[X] Close