[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

నయీమ్ నల్లధనం ఏమైందో తెలుసా..!

indion-news-special-story-on-nayeem-black-money

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అవినీతిపరులంతా విలవిలలాడిపోతున్నారు. నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక అనేక మార్గాలు అణ్వేషిస్తున్నారు. కొందరు డబ్బును తగలబెట్టడానికి వెనకాడడంలేదు. ఈ
నేపధ్యంలో  రౌడీలు, గూండాలు పోగేసిన వందల కోట్ల సంగతి ఏంటి? బతికున్నప్పుడు భూకబ్జాలు, సెటిల్ మెంట్లు దందాలతో వందకోట్ల కొల్లగొట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సంపద ఇప్పుడేమై ఉంటుంది. బతికుంటే నయీమ్ చనిపోకుండా ఉండి, ఆయనతో సబంధాలు కొనసాగించిన నేతల బంఢారం బయటపడుకుంటే పరిస్థితి బాగానే ఉండేది. నయీమ్
లేడు. ఆయన అనుచరులు ఒక్కోక్కరు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. నయీమ్ తో సంబంధాలు ఉన్న నేతలు.. సైలెంట్ అయిపోయారు. మరీ, నయీమ్ కూడబెట్టిన లెక్కలేని సందప ఏమైనట్టు? ఇంకా పోలీసులకు దొరకని ఆయన అనుచరులు డబ్బును మాయం చేస్తున్నారు? అడ్డదారుల్లో ఆ మనీ అంతా మార్చేసుకుంటున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. నయీమ్ హతమయ్యాకే అతని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తమను బెదిరించి ఆస్తులు లాక్కున్నాడని బాధితులంతా పోలీస్ స్టేషన్లకు క్యూకట్టారు. కేసును విచారించిన సిట్ అధికారులు నయీమ్ కు
సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లలలో  వందల ఎకరాలును నయీమ్ కబ్జా చేసినట్లు తేలింది. ఆ భూములన్నింటిని యజమానులకు తిరిగి ఇచ్చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను తెలంగాణ సర్కార్ కు పంపారు. ఇక నయీమ్ కు కోట్లకు కోట్ల డబ్బు ఇచ్చిన
వారికి ఆ డబ్బు తిరిగొచ్చే అవకాశం లేనట్లే. ఎందుకంటే.. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ క్రమంలో పోలీసులకు కళ్లుగప్పి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నయీమ్ అనుచరులు ఆ డబ్బును మొత్తం మార్చేసినట్లు తెలుస్తోంది. నయీమ్ అక్రమంగా లాగేసుకున్న భూములు విషయంలో మాత్రం వాటి యజమానులు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఈ భూముల విలువల వెయ్యికోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నయీమ్ కబ్జా చేసిన  ఆ భూములన్ని హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనివేనని సమాచారం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా నయీమ్ లాగేసుకున్న భూములున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తానికి భూముల రూపంలో నయీమ్ కు చిక్కిన వాళ్లంతా సేఫ్జోన్లో ఉన్నారు.  సెటిల్‌మెంట్స్ చేయడానికి కొందరు బడా బాబులు కోట్లకు కోట్లు సమర్పించారు. అదంతా నల్ల డబ్బే. ఇప్పుడు ఆ దొంగలంతా నయీం అనుచరుల వేటలో బిజీగా ఉన్నారు. అయితే సడన్ గా కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఆ అక్రమార్కులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇక ఆ డబ్బుపై ఆశలు
వదిలేసుకోవాల్సిందే.

Loading...
[X] Close