[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » బాలయ్య స్పీడ్ కి మెగా ఫామిలీ చెక్ పెట్టగలదా?

బాలయ్య స్పీడ్ కి మెగా ఫామిలీ చెక్ పెట్టగలదా?

is Pawan kalyan enough To Beat Gautami Putra Satakarni Speed

ఖైదీ నంబర్ 150తో పోలిస్తే గౌతమిపుత్ర శాతకర్ణి కే క్రెడిట్ అంతా వెళ్లిపోతోంది. అంతేకాదు శాతకర్ణితో అటు బాలకృష్ణ, ఇటు క్రిష్ బంపర్‌హిట్ కొట్టేస్తారన్న టాక్ వినిపిస్తోది. దీంతో ఖైదీ నంబర్ 150 సినిమాను రామ్‌చరణ్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. అందుకే ప్రి రిలీజ్ ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించి పబ్లిక్‌లో టాక్ పెంచాలని భావిస్తున్నాడట. అంతేగాకుండా శాతకర్ణి ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన జనాల కన్నా.. అధిక సంఖ్యలో అభిమానులను తరలించాలన్న యోచనలో రామ్‌చరణ్ ఉన్నాడట. అవన్నీ కాక తన బాబాయ్ పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా కార్యక్రమానికి తీసుకు రావాలని ఏర్పాట్లు చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ వచ్చి ఓ పది నిముషాలు మాట్లాడితే సినిమాకు భారీగా హైప్ పెరుగుతుందన్న యోచనలో ఉన్నాడని అంటున్నారు. పవన్‌తో పాటు ప్రిన్స్ మహేశ్‌బాబును కూడా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి చెర్రీ ఆహ్వానిస్తాడని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఇటీవల ఈ ఇద్దరు హీరోలు క్లోజ్‌గా ఉంటున్నారు కూడా. యూరప్ ట్రిప్‌లో ఉన్న మహేశ్ ఫ్యామిలీతో కలిసి చెర్రీ ఓ ఫొటోను కూడా సోషల్ మీడియా లో రిలీజ్ చేసాడు. ఇదంతా చూస్తుంటే.. చెర్రి పిలిస్తే ప్రిన్స్ రాకుండా ఉంటాడా అనిపిస్తోంది.అయితే మహేష్ బాబు వచ్చినా, రాకపోయినా కేవలం పవన్ కల్యాణ్ వచ్చినా ఈ వేడుకకు చాలా ప్లస్ అవుతుంది. మరీ, అన్నయ్య మూవీ వేడుకకు పవన్ హాజరవుతాడా? లేదా తెలియాలంటే.. ఆ రోజు దాక ఎదురుచూడాల్సిందే.

Loading...
[X] Close
Share