[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » బాలకృష్ణ దగ్గర దొరికింది బ్లాక్ మనీ కాదట…!

బాలకృష్ణ దగ్గర దొరికింది బ్లాక్ మనీ కాదట…!

IT Officials Caught Balakrishna Family Members With Rs 10 Lakhs Old Currency Notes

నోట్లరద్దు తరువాత దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో నల్లధనం వెలుగుచూస్తోంది. పాతనోట్ల మార్పడి కోసం అక్రమార్కులు పెద్ద ఎత్తున డబ్బును తరలిస్తూ పట్టుబడుతున్నారు.  ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సబంధించిన బ్లాక్ మని పట్టుబడినట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీలు చేస్తుండగా…బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వద్ద10 లక్షల రూపాయలు వెలుగుచూశాయి. దీంతో మిడియాలో బ్లాక్ మనీ పట్టబడిందంటూ బ్రేకింగులు ప్రసారమయ్యాయి. అయితే, కొద్దిసేపట్లో అది బ్లాక్‌మనీ కాదని తేలిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బుకి లెక్క చూపించడంతో.. అది బ్లాక్‌మనీ కాదని అధికారులు తేల్చేశారు.  అసలు విషయం ఏంటంటే.. వసుంధరా దేవి తిరుమల శ్రీవారు దర్శనం కోసం హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే, అక్కడ చెక్‌పోస్ట్ దగ్గర చెకింగ్‌లో వసుంధరా బ్యాగ్‌లో 10 లక్షల నోట్ల కట్టలను అధికారులు గుర్తించారు. ఆ డబ్బుకి వసుంధరా దేవి లెక్కలు చూపించమని అధికారులు కోరగా, ఆమె ఆ వివరాలన్నింటినీ సమర్పించారు. దీంతో అది నల్లధనం కాదని తేలిపోయింది. ఆ తర్వాత వసుంధర రోడ్డు మార్గం ద్వారా తిరుమలకి చేరుకొన్నారు.

Loading...
[X] Close