[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » బిజినెస్ » బంగారం వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్న ఐటీ శాఖ

బంగారం వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్న ఐటీ శాఖ

it-raids-on-gold-shops-in-hyderabad
హైదరబాద్ లోని బంగారం దుకాణాలపై ఐటీ శాఖ పంజా విసిరింది. యాబై బృందాలు నగరం వ్యాప్తంగా ఒకేసారి సోదాలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బంగారం, వజ్రాభరణాల దుకాణాల్లో అధికారులు ఈ సోదాలు కొనసాగించారు. పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజు నుంచి నగరంలో బంగారాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా రూ. 500, 1000 నోట్ల రద్దు ప్రకటించిన తేదీ నుండి పలు దుకాణాల్లో జరిగిన విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ఆయా రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ విషయంపై ఎలాంటి విషయాలను బయటకు చెప్పలేదు.

Loading...
[X] Close