[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » కోస్తాలో జగన్ పార్టీ గల్లంతేనా ? అదే అసలు కారణమా…!

కోస్తాలో జగన్ పార్టీ గల్లంతేనా ? అదే అసలు కారణమా…!

jagan's ysrcp party facing problems in andhra

ఉప్పులేటి కల్పనతో జగన్ పార్టీ నుండి రెండో విడత జంపింగ్స్ మొదలయ్యాయ్. ఇక కంటిన్యూ అవుతాయ్ అనిపిస్తోంది. ఇప్పటి వరకు మరో అరజడను మంత్రులు అప్రోచ్ అయ్యారని… రెండు నెలల్లో చేరికలు ఉంటాయని టీడీపీ నమ్మకంతో చెబుతోంది. ఇంతకీ ఎవరు వాళ్లు ? ఏంటా స్టోరీ ? మీరు చుడండి మరి…
కోస్తా ప్రాంతంలో ఇప్పటికే వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ‘పార్టీ జంపింగ్స్’ రూపంలో మరో దెబ్బ పడబోతుందంటున్నారు రాజకీయ పండితులు. క్రిష్ణా జిల్లాలో ఉప్పులేటి కల్పన తర్వాత మెట్టప్రాంతంలోని మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ సైకిల్ ఎక్కేందుకు సై అంటున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మిగిలిన వాళ్లు ‘జంపింగ్’ ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. కర్నూలు నుంచి కూడా మరో ఎంట్రీ నమోదవ్వబోతుందని ఖచ్చితంగా చెబుతున్నాయ్ టీడీపీ వర్గాలు. బడ్జెట్ సమావేశాలనాటికే తెలుస్తుందా లేక ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందేమో తెలియదు కానీ ‘రాక’ మాత్రం ఖాయం అంటున్నాయ్ టీడీపీ శ్రేణులు.
అదే జరిగితే జగన్ పార్టీ కోస్తా నుండి కనుమరుగు అయిపోతుంది దాదాపుగా !…మరి ఈ ‘జంపింగ్స్’ కి జగన్ తన రాజకీయ అస్త్రాలతో ఎలా అడ్డు కట్ట వేస్తారో తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే మరి.

Loading...
[X] Close
Share