[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » సభలో జానా రెడ్డి వర్సెస్‌ కేటీఆర్…!

సభలో జానా రెడ్డి వర్సెస్‌ కేటీఆర్…!

jana reddy vs ktr

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కి మంత్రి కేటీఆర్‌ కి మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరిగింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన పువ్వాడ అజయ్‌ కుమార్‌కు స్పీకర్‌ మైక్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ పార్టీ పక్ష ఉపనేత జీవన్‌ రెడ్డి తన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి వెళ్లిపోయిన వ్యక్తికి కాంగ్రెస్‌ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. అజయ్‌ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు.ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ శాసనసభ సభ్యుడిగా అజయ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలపగా, మంత్రులు కడియం, కేటీఆర్‌ స్పీకర్‌ వ్యాఖ్యలను సమర్థించారు. స్పీకర్‌ అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ స్పీకర్‌ నిర్ణయమే ఫైనల్‌ అని అన్నారు. 2004-14 వరకు ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఇంతలో జానారెడ్డి కల్పించుకుని ఏ పార్టీ వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్లే మాట్లాడాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మాత్రం సభ జరిగితే ప్రశ్నిస్తామని అన్నారు. అధికారం ఉందికదా అని ఏమైనా చేస్తామనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

Loading...
[X] Close