[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » అమ్మ నల్లధనం సంగతేంటి? – Indion News

అమ్మ నల్లధనం సంగతేంటి? – Indion News

jayalalitha-black-money-where-is-jayalalitha-black-money-what-is-tn-cm-health-condition

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతిపరులంతా లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు సీఎం జయలలిత  ఆపార సంపదపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.  అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ
పెద్దనోట్లు రద్దు చేయడంతో అమ్మ కూడబెట్టిన సొమ్ముపై భిన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జయలలిత ముఖ్యమంత్రి కాకముందే ఆమె వద్ద వేలకోట్ల సొమ్ము ఉందనే టాక్ ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక అమె సంపాదన చాలా రేట్లు పెరిగింది.అప్పట్లో కేవలం పెంపుడు కొడుకు పెళ్లి కోసమే, జయ డబ్బును నీళ్లలాగా ఖర్చుపెట్టేసింది. ఇంతా చేసినా సీబీఐ ఈ విషయంలో ఏం చేయలేకపోయింది. ఎన్నిసార్లు అమ్మ అక్రమాస్తులపై దాడిచేసినా ఆస్తులు, పత్రాలు సీజ్ చేశారు కానీ, నగదు మాత్రం దొరకలేదు. ఖచ్చితంగా జయలలిత దగ్గర భారీగానే ఐదువందలు,వెయ్యి రూపాయల నోట్లు ఉండి ఉంటాయి.  ఇప్పుడు వాటి రద్దుతో జయలలిత దాచిన సొమ్మంతా కంచికి చేరినట్లేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే జయలలిత దగ్గర నిజంగానే అపారమైన సొమ్ము ఉందా? అంటే ఖచ్చితమై ఆధారాలు లేవు. తమిళ మీడియా మాత్రం జయ దగ్గర లెక్కకుమించిన సంపద ఉందంటూ ఎప్పటి నుంచో చెబుతున్నాయి. అమ్మ దీనిపై ఎప్పుడు స్పందించినా.. అక్రమాస్తులు మాట అంతా అబద్ధమని, తనపై బురదజల్లేందుకు ఇలాంటివి పుట్టిస్తున్నారని
చెప్పుకొచ్చేది.  ఒక వేళ జయ దగ్గర భారీగా నగదు ఉంటే అదంతా ఎక్కడ దాచినట్టు? జయ ఎప్పటిలా మామూలుగా ఉంటే డబ్బు విషయంపై ఇంత చర్చ జరిగేది కాదు.అమ్మ ఆరోగ్యంగా లేకపోవడంతోనే ఈ చర్చంతా.  కానీ, జయ ఆసుపత్రికి పరిమితమై వారాలు గడిపోతున్నాయి. దీంతో ఆమె సన్నిహితులు, పార్టీ వర్గాలు ఈ విషయంలో ఆందోళన
వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సొమ్ము మార్పిడికి ఇంకా సమయం ఉన్నందు వలన ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. అప్పటి లోగా అమ్మ కోలుకునే అవకాశం కూడా ఉంది. మరీ! ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Loading...
[X] Close