[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » అమ్మ మరణంపై అనుమానాలు..!..మేనకోడలు చెప్పిన అసలు రహస్యం

అమ్మ మరణంపై అనుమానాలు..!..మేనకోడలు చెప్పిన అసలు రహస్యం

jayalalitha death mystery

జయలలిత మరణం వెనక ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది మొదలు అన్నీ సందేహాలే. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది అత్యంత రహస్యం. బయటకు ఏ వార్త తెలిసినా.. దాన్నే అంతా నిజం అనుకునేలా పరిస్థితులు కల్పించారు. అమ్మ మరణవార్తను ధృవీకరించే విషయంలోనూ పెద్ద ఎత్తున డ్రామా నడిచింది. ఒక వైపు జయలలిత చనిపోయి ఉండగా.. మరోవైపు పన్నీరు సెల్వంను ఆగమేఘాల మీద శాసనసభాక్ష నేతగా ఉన్నుకోవడం, ఆ వెంటనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం అనేక అనుమానాలకు తావునిచ్చింది. మహిళ అయిన శశికళ, జయలలిత అంత్యక్రియలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది . ఈనేపధ్యంలో జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నారు ఆమె మేనకోడలు దీప జయకుమార్.  వాటిపై తాను త్వరలో నోరు విప్పుతానని అన్నారామె. తన మేనత్త జయలలిత అంత్యక్రియలు శశికళ నిర్వహించడంపై దీప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శశికళపై దీప పలు విమర్శలు చేశారు. అంత్యక్రియలు ఓ మహిళ నిర్వహించడం తానెక్కడ చూడలేదని ఆమె అన్నారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనను అనుమతించాలని దీప..ఆసుపత్రి బయట రెండురోజుల పాటు వేచి ఉన్నారు. అయినా దీపను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీప, జయ సోదరుడు జయకుమార్ కూతురు. జయకుమార్ బతికున్నప్పుడు ఆయన కుటుంబం జయతో పాటే ఉండేది. ఆ తరువాత కొన్నాళ్లకు జయలలిత వీరిని దూరం పెట్టారు. 1995లో జయకుమార్ మృతి చెందినప్పుడు జయ చివరిసారిగా వారింటికి వెళ్లారు. ఆ తరువాత జయకుమార్ భార్య చనిపోయినా.. మేనకోడలు, మేనల్లుడిని జయ పరామర్శించలేదు.జయ తల్లి సంధ్య తనకు నానమ్మ అని,జయ ఆస్తులకు తాను వారసురాలినని దీప చెబుతోంది. ఇక జయలలితకు వందకోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఇందులో జయ ఇంటి విలువే 40 కోట్లకు పైగా విలువచేస్తుంది. ఈ నేపధ్యంలో జయ ఆస్తుల విషయంలో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Loading...
[X] Close
Share