[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » జయలలితకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా?

జయలలితకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా?

jayalalitha favourite movie

అటు సినిమాలు , ఇటు రాజకీయాలు.. ఈ రంగాల్లో ఎన్నో సక్సెస్ లు చూశారు జయలలిత. అయితే రాజకీయాల్లో ఉన్న ఆమె సినిమాలకు ఏనాడు దూరంగా కాలేదు. ఇంట్లోనే సినిమాలు చూడడం, వందేళ్ల భారతీయ సినిమా లాంటి వేడుకను గ్రాండ్ గా నిర్వహించడం.. ఇవన్నీ సినిమాలపై జయలలితకు ఉన్న ఆసక్తికి నిదర్శనం. జయలలిత రాజకీయాల్లో ఉన్నప్పటికీ, సినిమా ప్రపంచానికి అత్యంత దగ్గర ఉన్నారు. ఒకనాటి హీరోయిన్ గా ఆమె సినిమా ఫీల్డ్ పై ఎంతో అభిమానించేవారు. అవార్డు ఫంక్షన్లు నిర్వహించడం, సినిమా ప్రముఖులకు ప్రభుత్వం తరపున గౌరవించడం లాంటి ఎన్నో కార్యక్రమాలను జయ తన హయాంలో నిర్వహించింది. అదే సమయంలో ఇంట్లోనే తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు. జయలలితకు ఇష్టమైన, ఎక్కువసార్లు చూసిన సినిమా గుండమ్మ కథ. ఈ విషయాన్ని జయలలిత ఓ సందర్భంలో స్వయంగా చెప్పారు. మనసు బాగోలేకపోయిన ప్రతీసారి ఆమె గుండమ్మ కథ సినిమా చూసేవారట. ఏ కాస్త సమయం దొరికినా ఆ సినిమా చూడాలనిపిస్తుందని చెప్పేవారు. ఈ సినిమాలో జయకు గుండమ్మ పాత్ర అంటే చాలా ఇష్టం. సినిమా చూస్తున్నప్పుడు నిజంగానే గుండమ్మ అనే ఒకావిడ ఉందని అనిపించేదట జయకు. చేతులూపుకుంటూ నడవడం, మాట్లాడడం, పొగిడితే పొంగిపోవడం, అంతలోనే పిసినారితనం, మొగుడి చెప్పుల్ని కళ్లకద్దుకోవడం, అంతా అయ్యాక మీరూ మీరూ ఒకటైతే మేమూ మేమూఒకటి కాదేంటి అని తేల్చేయడం అన్నీ గుండమ్మకే చేతనవుతాయి అని జయలలిత ఆ సినిమాపై తన ఇష్టాన్ని తెలియజేశారు.

Loading...
[X] Close
Share