[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » జయలలిత కూతురు దొరికింది?

జయలలిత కూతురు దొరికింది?

Jayalalitha Shobhanbabu Relation has a Daughter too

జయలలిత సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోలు సైతం ఆమెతో నటించేందుకు ఆసక్తిగా చూపించేవారు. అలాంటి సమయంలోనే శోభన్ బాబుకు జయ పక్కన కలిసి నటించే అవకాశం వచ్చినట్లేవచ్చి చేయిజారింది. శోభన్ బాబు చిన్న హీరో కావడంతో జయలలిత తల్లి ఆయన పక్కన నటించడానికి ససేమిరా అన్నారు. దీంతో శోభన్ బాబు 8 సంవత్సరాల పాటు జయతో నటించేందుకు తపస్సులా ఎదురు చూశారు. ఆ తరువాత డాక్టర్ బాబు చిత్రంతో శోభన్ బాబు కల నెరవేరింది. మొదట జయలలిత అందరు హీరోలతో ఉన్నట్లే శోభన్ బాబు దగ్గర నడుచుకున్నారు. కానీ, కొంతకాలానికే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. అప్పటికే తల్లి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జయలలితకు శోభన్ బాబు పంచే ఆత్మీయత, ఆయనలోనే హాస్యచతురత ఎంతగానో ఆకట్టుకునేవి. అలా జయలలిత తన బాధనంతా మరిచి మామూలు మనిషయ్యారు. శోభన్ బాబు చూపించే ప్రేమ ఆమెకు కొండంత అండగా నిలబడింది. అమ్మ పోయాక అంతా పోయిందని అనుకున్నా.. కానీ, ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని ఓ సందర్భంలో జయ, శోభన్ బాబు గురించి స్వయంగా చెప్పారు. ఆ సమయంలోనే శోభన్ బాబు, జయలలిత మధ్య బంధం మరింత బలపడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే అప్పటికే శోభన్ బాబుకు పెళ్లైంది. దీంతో జయలలిత, శోభన్ బాబు సహజీవనం సంగతులు పుకార్లుగానే మిగిలిపోయాయి.. అయితే.. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టిందని, ఆ పాప పేరు  శోభన అని అప్పట్లో వార్తలు వినిపించేవి. శోభన అనే పేరు కూడా శోభన్ బాబుపై జయలలితకు ఉన్న ప్రేమ కారణంగానే పెట్టి ఉంటుందని అనేవారు ఉన్నారు. అయితే అప్పటికే జయను ఎమ్జీఆర్ చేరదీయడం, తమిళ రాజకీయాల్లో వైపు జయ అడుగులేయడం ప్రారంభించారు. దీంతో శోభన్ బాబుకు జయ పూర్తిగా దూరమయ్యారు. ఇద్దరికి పుట్టిన కూతుర్ని కూడా హైదరాబాద్ లో రహస్యంగా పెంచారనే టాక్ ఉంది. ఆమె యుక్తవయస్సుకు వచ్చాక వివాహం కూడా చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శోభన్ బాబు, కూతురు పిల్లాపాపలతో హాయిగా జీవితాన్ని గడుపుతోందని సమాచారం.

Loading...
[X] Close
Share