[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » రిలీజ్ కి రెడీ ఐన ‘జయమ్ము నిశ్చయమ్మురా’

రిలీజ్ కి రెడీ ఐన ‘జయమ్ము నిశ్చయమ్మురా’

jayammu-nischayammu-raa-movie
హర్రర్ నేపధ్యంలో వచ్చిన గీతాంజలి చిత్రంతో కమెడియన్ నుంచి హీరోగా మారాడు శ్రీనివాసరెడ్డి. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. ఆ మూవీ ఇచ్చిన విజయంతో ఈసారి పూర్తిస్థాయి హీరోగా రాబోతున్నాడాయన. తాజాగా ఆయన నటించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. పూర్ణ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలె విడుదల చేసిన ఈ సినిమా వీడియో సాంగ్ యూట్యూబ్ లో వ్యూయర్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాను చూసిన నిర్మాత కృష్ణారెడ్డి ఏడు కోట్ల రూపాయలు చెల్లించి హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నిర్మాత విక్రమ్ రీసెంట్ మూవీ ఇంకొక్కడును ఇటీవల తెలుగులో విడుదల చేశాడు. ఇంత భారీ మొత్తంలో సినిమా అమ్మడుపోవడంతో నిర్మాత, దర్శకుడు అయిన కనుమూరి శివరాజ్‌ చాలా ఆనందంగా ఉన్నాడట. ఓ కమెడియన్‌ హీరోగా నటించిన మొదటి సినిమా ఆ స్థాయిలో అమ్ముడుపోవడమంటే విశేషమే మరీ. అందుకే సినీ జనాలు ఈ సినిమా గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన చేతలు మీదుగా విడుదలైన ఓ రంగుల చిలకా సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈనెల 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరీ.

Loading...
[X] Close