[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » ట్రంప్ గెలవడానికి కెఎ పాలే కారణమట : షాకింగ్ న్యూస్

ట్రంప్ గెలవడానికి కెఎ పాలే కారణమట : షాకింగ్ న్యూస్

ka paul behind Trump's victory

కెఎపాల్ కొత్తగా ఎవ‌రికీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని వ్య‌క్తి.. వైఎస్ హ‌యాంలో పెట్టిన టార్చ‌ర్ కు పాల్ మాన‌సికంగా దెబ్బ‌తిన్నాడు. ఆ త‌రువాత సోద‌రుడి మ‌ర‌ణం కేసులో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. మ‌త ప్ర‌చార‌కుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరున్న పాల్ కు ప్ర‌త్యేకంగా సొంత విమానాలు కూడా ఉన్నాయి. అనేక వివాదాల్లో ఇరుక్కున్న పాల్ త‌న తాహ‌తుకు మించిన మాట‌ల‌తో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు హాస్యాన్ని పంచే వ్య‌క్తిగా మిగిలిపోయాడు.

అయితే ఇవన్నీ ఇప్పుడెందుకనుకుంటున్నారా…..మేటర్ ఉందండి.. ఇప్పుడు తాజాగా పాల్ తన వ్యాఖ్య‌లతో మ‌రోసారి మీడియాకు ఎక్కాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడిగా గెల‌వ‌డంలో త‌న పాత్ర ఎంతో ఉంద‌ని, త‌న జీవితం ఆధారంగా ఓ సంచ‌ల‌న పుస్త‌కం తీసుకువ‌స్తున్న‌ట్లు పాల్ వెల్ల‌డించారు. ప్ర‌పంచంలో పెరిగిన యుద్దాలు,ఉగ్రవాదం మూలంగా అత్య‌వ‌స‌రంగా శాంతి నెల‌కొల్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, పాల్ తన ‘జీవిత‌క‌థ’ బ‌య‌ట‌కు వ‌స్తే అధ్భుతాలు జ‌రుగుతాయ‌ని అంటున్నారు. మ‌రి పాల్ గారి పుస్త‌కం చ‌ద‌వ‌డానికి రెఢీగా ఉండండి.

Loading...
[X] Close
Share