[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » అమ్మాయిల దుస్తులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి..!

అమ్మాయిల దుస్తులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి..!

karnataka home minister sensational comments on ladies dresses

మహిళలను వేదించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన హోమ్ మంత్రి, రివర్స్ లో మహిళలదే తప్పని నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశాడు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులో కొందరు ఆకతాయి కుర్రాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, వారి ప్రైవేటు పార్టులను కూడా తాకారు. ఈ సంఘటన జరిగిన స్థలంలో కొందరు ఫోటులు తీయడంతో అక్కడ ఏం జరిగింది అనే విషయం బయటకి వచ్చింది. అలా మహిళల పట్ల అంత అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిసి, దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుంటే..కర్ణాటక హోమ్ మంత్రి మాత్రం కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

మగవాళ్ళు అలా ప్రవర్తించడానికి అసలు కారణం అమ్మాయిలే అని, అమ్మాయిలు ఫుల్ గా తాగి రోడ్ల మీదకు రావడం వల్లనే ఇదంతా జరిగిందని, అక్కడున్న వారంతా వెస్ట్రన్ టైపు దుస్తులు వేసుకోవడం వల్లనే ఇదంతా జరిగిందని, న్యూ ఇయర్ రోజే ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పిన మంత్రి, వాటి కోసం ఇంత రాద్దాంతం చెయ్యాల్సిన అవసరం లేదని చాలా సిల్లీగా కొట్టిపడేశాడు.

మరో వైపు మంత్రి గారి మాటలకు భగ్గుమన్న మహిళా సంఘాలు…తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Loading...
[X] Close