[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » పవర్ స్టార్ అభిమానుల దాహం తీరింది..!

పవర్ స్టార్ అభిమానుల దాహం తీరింది..!

KatamaRayudu First Look Teaser

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అభిమాన దాహం తీరింది. న్యూ ఇయర్ నేపధ్యంలో కాటమరాయుడు సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక్కో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు మూడు స్టిల్స్ విడుదల చేశారు. అయితే ఏ ఒక్క పోస్టర్ లోను పవన్ ని పూర్తి గా చూపించకుండా చిత్రబృందం సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దీంతో పోస్టర్లు అదిరిపోయినప్పటికీ, తమ హీరో పూర్తిగా కనిపించకపోవడంతో అభిమానులు కొంత నిరుత్సాహపడ్డారు. అయితే ఎట్టకేలకు కాటమరాయుడు పవర్ ఫుల్ మోషన్ పోస్టర్ ను చిత్రబృందం న్యూ ఇయర్ కు ఒక రోజు ముందే అభిమానుల ముందుకు తీసుకువచ్చింది. సీరియస్ లుక్ తో కుర్చిలో కూర్చొని ఉన్న పవన్ కల్యాణ్ పోస్టర్ కేకపెట్టిస్తోంది. తమిళ చిత్రం వీరమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2017 మార్చిలో రిలీజ్ కానుంది.

Loading...
[X] Close
Share