[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » ఈ విష‌యం గానీ ఆంధ్రా జ‌నాల‌కు తెలిసిందంటే?

ఈ విష‌యం గానీ ఆంధ్రా జ‌నాల‌కు తెలిసిందంటే?

kcr-succeed-to-bring-more-currency-that-chandrababu-after-modi-demonetization

‘మోడీ’ పెద్ద నోట్ల రద్దు తరువాత సామాన్య జనాలు డబ్బు దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ కష్టాలని నివారించడానికి తెలుగు రాష్ట్రాల చంద్రులు చంద్ర‌బాబు నాయుడు, కేసీఆర్.. కేంద్రం సహకారంతో ఆర్బీఐ నుంచి డబ్బు తెచ్చి రాష్ట్రంలోని బ్యాంకులకు అందేలా చేయడానికి ఎవరికి వారు బాగానే ప్ర‌య‌త్నించారు. కానీ, ఈ విషయంలో ఆంధ్రా సీఎం చంద్రబాబు కంటే తెలంగాణా సీఎం కేసీఆరే బాగా సక్సెస్ అయ్యాడట. నిజానికి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఆప్తుడు,భాగస్వామి అయినా కూడా ఆయన మాట చెల్లుబాటు కాలేదని.. తెలంగాణ బాస్ కేసీఆర్ మాటే చెల్లుబాటయిందని తెలుస్తోంది.

కొత్త నోట్లు రప్పించడంలో ‘బాబు’ బాగా వెనుకబడిపోయారు. ఈ విషయంలో చంద్రబాబు కంటే కేసీఆర్‌ చాలా ముందున్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన నగదును పోల్చి చూస్తే.. తక్కువ జనాభా ఉన్నప్పటికీ తెలంగాణకే ఎక్కువ కరెన్సీ సరఫరా అయింది. తెలంగాణలో జనాభా 3.8 కోట్లు కాగా ఇప్పటి వరకు 20. 704 వేల‌కోట్ల విలువైన కొత్త కరెన్సీ కేసీఆర్‌ తెప్పించగలిగాడు. ఏపీ జనాభా 5.5 కోట్లు అయినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 14వేల 740 కోట్లు మాత్రమే కొత్త కరెన్సీ ఆంధ్రా కు వచ్చింది.

ఏపీతో పోలిస్తే తెలంగాణకు ఏకంగా 6700 కోట్ల సొమ్ము ఎక్కువగా వచ్చింది. చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేసీఆర్‌ మాత్రం తెలంగాణ‌లోని వాస్త‌వ ప‌రిస్థితుల‌ను కేంద్రానికి వివ‌రించి ఎక్కువ నగదు సాధించు కోవటంలో సఫలమయ్యారు. అంతేకాదు… నగదు తెప్పించడంతో పాటు తెలంగాణా ప్రజల చిల్లర కష్టాలను తీర్చడంలో కూడా కేసీఆర్‌ సఫలమయ్యారు. రూ.2 వేల నోట్ల కారణంగా తలెత్తే చిల్లర కొరత నివారణకు కూడా కేంద్రంతో మాట్లాడి 480 కోట్ల విలువైన 500, 100 నోట్లను కేసీఆర్‌ తెప్పించగలిగారు. కేవలం గడిచిన రెండు రోజుల్లోనే తెలంగాణకు 1600 కోట్ల నగదు వచ్చింది. కేసీఆర్ నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ .. కేంద్రాన్ని ఒప్పించి నోట్ల‌ను తెప్పించుకుంటుంటే చంద్ర‌బాబు నాయుడు మాత్రం స‌మీక్షలు .. స‌దస్సులు అంటూ ఏ ప‌ని చేయ‌లేక‌పోతున్నాడ‌ని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు .

Loading...
[X] Close