[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » తెలంగాణా ప్రజలకి కేసీఆర్ అంటే ఎందుకిష్టమో తెలుసా…!

తెలంగాణా ప్రజలకి కేసీఆర్ అంటే ఎందుకిష్టమో తెలుసా…!

చాలామంది నాయ‌కుల‌కు అర్థంకాని విష‌యం… కెసిఆర్ కే ఎక్కువ అభిమానులు ఎందుకున్నారో అని. ఈ సందేహానికి వివ‌ర‌ణ ఇచ్చే బ‌దులు జ‌స్ట్ ఈ వార్త ఒక్క‌టి చ‌దివితే చాలు… కేసీఆర్ జన నేత ఎలా అయ్యాడో తెలుస్తుంది. రోడ్డు సమస్యపై ఓ దివ్యాంగుడు రాసిన లేఖకు సీఎం కేసీఆర్‌ స్పందించారు. స్పందించడమే కాదు స్థానిక అధికారులను ఆదేశించి రూ.7 లక్షల వ్యయంతో రోడ్డు వేయించారు.కాగే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

kcr-telangana cmవివ‌రాల్లోకెళ్తే : సూర్యాపేట పట్టణం లో నివాసం ఉంటున్న గొట్టిపర్తి వెంకటేశ్వర్లు బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన నివసించే వీధి గుంతలు పడి, చిన్నపాటి వర్షం వచ్చినా రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఏం చేయాలో తెలియక నేరుగా సీఎం కేసీఆర్ కే నేరుగా లేఖలు రాశారు. ఈ లేఖలపై వెంటనే సీఎం కేసీఆర్ స్పందించారు! తక్షణమే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన ఆ సమస్యను పరిష్కరించారు.
ఓ సామాన్యుడు లేఖ రాస్తే సీఎం కేసీఆర్ స్పందించడం ఆయన గొప్పతనానికి నిరద్శనమని తెలంగాణా ప్రజలు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

Loading...
[X] Close