[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » వాళ్ళు చిరంజీవి ‘ఖైదీ నెం 150’ సినిమా చూసేసారట…ఇంతకీ సినిమా హిట్టా లేక ఫట్టా?

వాళ్ళు చిరంజీవి ‘ఖైదీ నెం 150’ సినిమా చూసేసారట…ఇంతకీ సినిమా హిట్టా లేక ఫట్టా?

Khaidi No 150 Movie Censor Report

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 సెన్సార్ టాక్ అదిరిపోయింది. తొలిసారి సెన్సార్ బోర్డు సభ్యులు మొత్తం 18 మంది సినిమాను చూడడం ఆసక్తికరంగా మారింది. తెలుగు సినిమా చరిత్రలో సెన్సార్ సభ్యులు మొత్తం మంది చూసిన సినిమా ఇదేనని చెబుతున్నారు. చిరు మూవీని చూడటానికి సెన్సార్ సభ్యులు చాలా ఆసక్తిచూపించినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా విషయంలోనూ ఇలా జగరలేదు. దీంతో మెగాస్టార్ పవర్ అంటే.. ఇదేఅని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు బోర్డు సభ్యులు అలా చూస్తుండిపోయారని, షో పూర్తి కాగానే లేచి నిలబడి క్లాప్స్ కొట్టారని తెలుస్తోంది.వచ్చే నెల 11న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా వ్యవధి 2 గంటల 27 నిమిషాలు. మొత్తానికి సెన్సార్ టాక్ తో మెగా ఫాన్స్ సంబరాలు మొదలు పెట్టేసారు. మరోవైపు ఇప్పటికే అమ్మడు లెట్స్ డు కుమ్ముడు 7 మిలియన్ వ్యూస్ దాటి ఆడియో సాంగ్ విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. మొత్తానికి సినిమా విడుదలకు ముందే మెగాస్టార్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇక సినిమా రిలీజైతే.. మెగా ఫ్యాన్స్ కు ప్రతీ రోజూ పండగేననడంలో ఎలాంటి సందేహంలేదు.

Loading...
[X] Close