[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » మెగాస్టార్ కు నచ్చితేనే చేస్తాడు,చూస్తాడు.. బలవంతం చేస్తే కోస్తాడు

మెగాస్టార్ కు నచ్చితేనే చేస్తాడు,చూస్తాడు.. బలవంతం చేస్తే కోస్తాడు

khaidi-no-150-official-teaser-mega-star-chiranjeevi

వీరాధి వీరుడు.. గ్రేటాది గ్రేటుడు..  స్టారాధి స్టారుడు.. మెగాస్టార్ చిరంజీవుడు దుమ్ములేపాడు. ఆయన నటించిన  ప్రతిష్మాతక చిత్రం ఖైదీనంబర్ వన్ టీజర్ రిలీజైంది. రాంచరణ్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. తొమ్మిదేళ్ల  తరువాత ముఖానికి రంగేసుకున్న మెగాస్టారుడు రీఎంట్రీలో అదరగొట్టాడు. కరువు నేలపై కుంభవృష్టి కురిసినట్టుగా  మెగాస్టార్ ను టీజర్ లో చూసిన మెగా ఫ్యాన్స్  తెగసంబరపడిపోతున్నారు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తే.. నచ్చితేనే  చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా.. ఏ స్వీటు వార్నింగ్  అంటూ తనదైన శైలిలో డైలాగులు అదరగొట్టాడు చిరు. ఈ  డైలాగ్ వింటుంటే.. ఇంద్ర సినిమాలో మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. అంటూ చిరు చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. ఇక  ట్రైలర్ చివర్లో చిరు కనిపించిన షాట్ హైలెట్ గా ఉంది. గత సినిమాలతో పోల్చితే చిరు స్టైల్ కూడా సరికొత్తగా ఉంది.  హావభావాలను చిరు సరికొత్తగా పలికించారు.  కొన్ని షాట్లలో చిరు కామెడీ యాంగిల్ లో చూపించారు. అంటే సినిమాలో  చిరు నుంచి ఫుల్ కామెడీని కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట. మొత్తానికి అన్నయ్య అదరగొట్టబోతున్నాడు. ఇక  రికార్డులు బద్దలవ్వాల్సిందే.

Loading...
[X] Close
Share