[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » కిరణ్‌ బేడీకి అశ్లీల వీడియో పంపిన అధికారి…!

కిరణ్‌ బేడీకి అశ్లీల వీడియో పంపిన అధికారి…!

Kiran Bedi suspends bureaucrat for posting obscene video in official WhatsApp group

ఓ ప్రభుత్వ అధికారికి పైత్యం పెరిగిపోయి ఏకంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీకి అశ్లీల వీడియోలు, మెసేజ్‌లను పంపాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రభుత్వ అధికారిపై వేటు వేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కిరణ్‌ బేడీ ఓ వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, దానిలో అన్ని శాఖల అధికారులనూ గ్రూప్‌ సభ్యులుగా చేర్చారు. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించి సత్వర ఆదేశాలు ఈ గ్రూప్‌ ద్వారానే ఆమె జారీ చేస్తుంటారు. ఇక శుక్రవారం రాత్రి ఈ గ్రూప్‌కు మూడు ఫోల్డర్లలో వీడియోలు వచ్చాయి. దీన్ని చూసిన కిరణ్‌ బేడీ సహా అధికారులు అంతా అవాక్కయ్యారు. అసభ్య మెసేజ్‌లు, వీడియోలు అందులో ఉన్నాయి. ఆ వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సెక్రటరీ ని కిరణ్‌ బేడీ ఆదేశించారు. సీనియర్‌ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిగిందని, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన్ను విధుల నుంచి తొలగించామని పుదుచ్చేరి ప్రభుత్వం తెలియజేసింది.

Loading...
[X] Close
Share