[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » రైతు నేతగా బాలయ్య బాబు …!

రైతు నేతగా బాలయ్య బాబు …!

balakrishna-raithu-movie-indion-newsగౌతమీపుత్ర సినిమా తరువాత బాలకృష్ణ చేయబోతున్న మూవీపై క్లారిటీ వచ్చింది. వందో సినిమాకు దూరమైన కృష్ణవంశీతోనే బాలయ్య తన తరువాతి మూవీ చేయనున్నాడు. దేశంలో ఎన్నో అంశాలపై సినిమాలు వస్తున్న రైతుల నేపధ్యంగా ఇటీవల కాలంలో ఒక్క సినిమా వచ్చిందిలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత బాలయ్యతో కృష్ణ వంశీ తెరకెక్కించే మూవీ రైతు నేపధ్యంగానే రాబోతుంది. ఈ సినిమా ద్వారా ప్రస్తుత సమాజంలో ఉన్న రైతుల పరిస్థితిని చూపెట్టబోతున్నాడు కృష్ణవంశీ. ఇక ఈ మూవీని గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ పూర్తవగానే మొదలు పెట్టాలని భావిస్తున్నాడట బాలయ్య. ఆ తర్వాత వెంటనే జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ మొదలవుతుందట. సినిమాలో బాలయ్య బాబు రైతు నేతగా కనిపిస్తాడని టాక్. రైతుల సంక్షేమం కోసం వారి తరఫున వారి సమస్యలపై పోరాడతాడట. అంతేగాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ ప్రాధాన్యాన్ని వివరిస్తాడని టాక్. మొత్తానికి ఇప్పడు రాజుగా కనిపిస్తున్న బాలయ్యను వచ్చే ఏడాది రైతుగా చూడొచ్చన్న మాట.

Loading...
[X] Close