[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » వీళ్ళకి ఇంత అందం ఎలా వచ్చిందో తెలిస్తే షాకే …!

వీళ్ళకి ఇంత అందం ఎలా వచ్చిందో తెలిస్తే షాకే …!

Leading Tollywood Actress Who Underwent Plastic Surgery

సినిమా,మెడలింగ్ రంగాల్లో ఎంట్రీ ఇవ్వాలంటే గ్లామర్ అనేది తప్పనిసరిగా మారింది. అయితే పుట్టుకతోనే మనిషి దేహంలో ఏవో లోపాలు ఉంటూ ఉంటాయి. దీంతో ఇలాంటి రంగాల్లోకి వచ్చేవారు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. అలా గ్లామర్ ఫీల్డ్ లోకి రావాలనుకునే వారిలో నూటికి 90 శాతం మంది సర్జరీల బాట పట్టేవారే. అతిలోక సుందరి శ్రీదేవి నుంచి నేటి తరం హీరోయిన్ల గ్లామర్ వెనక ఉన్న ఒకే ఒక రహస్యం ప్లాస్టిక్ సర్జరీ. బాలీవుడ్ హీరోయిన్లు బిపాషా, అనుష్క శర్మ, నర్గీస్ ఫక్రీ ఇంకా ఎంతోమంది తారలు ప్లాస్టిక్ సర్జరీలతో తమ అందచందాలకు మెరుగులు దిద్దుకున్నారు. కొంతమంది తారలు సినిమాల్లో ఎంట్రీకి ముందే సర్జరీలు చేయించుకుంటే.. మరి కొంతమంది సినిమాల్లో వచ్చిన తరువాత అందాలకు మరింత మెరుగులు దిద్దుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీల్లో అనేక రకాలున్నాయి. అయితే చాలామంది హీరోయిన్లు అందమైన ముక్కు కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి ఇలాంటి సర్జరీ చేయించుకోవడం ద్వారానే వార్తల్లో నిలిచింది. ఆ తరువాత దక్షిణాదిలో పెద్దగా సర్జరీలతో సినిమాల్లోకి కనిపించిన తారలు లేరనే చెప్పాలి. సౌందర్య లాంటి ఎంతో మంది హీరోయిన్లు నాచురల్ గ్లామర్ తో ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇటీవల మళ్లీ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునే తారలు ఎక్కువయ్యారు.త్రిష,నయనతార,సమంత, శృతిహాసన్, కార్తీక,ఆసిన్, కాజల్ అగర్వాల్ వీళ్లంతా అందమైన ముక్కు ఆకృతికోసం సర్జీల బాట పట్టారు. సమంత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సర్జరీల జోలికి పోలేదు. కానీ, 2012 లో సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో సామ్ సరికొత్తగా కనిపించింది. కారణం.. మరింత అందంగా కనిపించడం కోసం ఈ బ్యూటీ ముక్కుకు రైనోప్లాస్టి సర్జరీ చేయించుకుంది.లక్ష్మీ కల్యాణం మూవీతో సినిమా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో కాజల్ అగర్వాల్ నాచురల్ గా తెరపై మెరిసింది. అయితే ఆ తరువాత ఈ భామ కూడా ప్లాస్టిక్ సర్జరీల ద్వారా ఫేస్ లో చిన్న చిన్న మార్పులు చేయించుకుంది. కానీ, ఈ వార్తలను కాజల్ గతంలోనే ఖండించింది. ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నయనతార హెవీ వెయిట్ ఉండేది. దీంతో కాస్మోటిక్ సర్జరీ ద్వారా నయన్ బరువును ఓ మోతాదులో తగ్గించుకుంది.దక్షిణాది నుంచి బాలీవుడ్ లో వరకు దూసుకెళ్లిన అందాల భామ అసిన్కూడా అంతే.పెద్దగా ఇబ్బంది ఎదురవకపోయినా.. అమ్మడు కింది పెదవికి సర్జరీ చేయించుకుంది. ఇక కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ది ఇదే తీరు. ముక్కు తో పాటు కిందిపెదవికి ఈ భామ సర్జరీ చేయించుకుంది. అలనాటి నటి రాధ కూతురు కార్తీక అందవిహీనంగా ఉన్న తన ముక్కును సినిమాల్లో ఎంట్రీకి ముందే సర్జరీ ద్వారా అందంగా మార్చేసుకుంది. అందాల భామ త్రిష విషయంలో మాత్రం ప్లాస్టిక్ సర్జరీ ఒక రూమర్ గా మిగిలిపోయింది. త్రిష కూడా రైనోప్లాస్టి సర్జరీ ద్వారా ముక్కు ఆకృతిని మార్చుకుందనే టాక్ ఉంది. అయితే దీనిపై త్రిష ఎప్పుడు ఎలాంటి కామెంట్ చేయ్యలేదు. మొత్తానికి అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ బయటకు రాకపోయినా.. హీరోయిన్లలో వచ్చిన గ్లామర్ మార్పులు సర్జరీలను తేటతెల్లం చేశాయి. అయితే వీళ్లలో చాలామంది హీరోయిన్ల సర్జరీ తరువాత కంటే, పూర్వమే బాగున్నారన్నది సినీ ప్రియుల మాట.

Loading...
[X] Close
Share