[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్ » మిస్టర్‌ ఆసియాగా బాలకృష్ణ

మిస్టర్‌ ఆసియాగా బాలకృష్ణ

mister-asia
ఫిలిప్పీన్స్‌ లో జ‌రిగిన Phil-Asia బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో బెంగళూరుకు చెందిన జి.బాలకృష్ణ అనే ట్యాంకర్‌ డ్రైవర్ ‘మిస్ట‌ర్ ఆసియా’ టైటిల్ ను సొంతం చేస్కున్నారు. గ‌తంలో జ‌ర్మ‌నీలో నిర్వ‌హించిన‌ పోటీలోనూ అండర్‌-24 కేటగిరిలో మిస్టర్‌ యూనివర్స్‌ గా బాల‌కృష్ణ టైటిల్ గెలుపొందాడు. 2014 ఏథెన్స్‌ లో జరిగిన పోటీల్లోనూ అండర్‌- 24 కేటగిరి లో మిస్టర్‌ వరల్డ్‌ గా నిలిచాడు. బాడీ బిల్డింగ్‌లో ఎన్నో ప‌తకాలు సాధించిన బాల‌కృష్ణ‌ బెంగళూరు ఆర్నాల్డ్‌ గా పేరు తెచ్చుకున్నాడు. తన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న బాలకృష్ణ.. ఆయన తల్లి పర్వతమ్మ, సోదరుడు రాజేష్‌ల ఆల‌నాపాల‌న‌లో పెరిగాడు. ముంబాయి కి చెందిన సంగ్రామ్‌ చౌగ్లా, పంజాబ్‌కు చెందిన మునిష్‌ కుమార్‌ల వ‌ద్ద బాడీ బిల్డింగ్‌లో శిక్షణ పొందారు. జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా, వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ గా పనిచేస్తూనే అంత‌ర్జాతీయ పోటీల్లో రాణిస్తున్నారు.

Loading...
[X] Close