[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » నల్ల బాబులపై ‘మోదీ’ సర్కార్ మాస్టర్ ప్లాన్

నల్ల బాబులపై ‘మోదీ’ సర్కార్ మాస్టర్ ప్లాన్

modi plan on black money

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పుడు మోడీ  ప్రభుత్వం ఏం చేయబోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర కాల పరిధి వచ్చే ఏడాది మార్చ్ వరకు కొనసాగనుంది.. అయితే నోట్ల రద్దు కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఈ కాల పరిధిని కేంద్రం 2017 డిసెంబర్ వరకు పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివర్లో వెలువడే అవకాశం ఉంది.   ఇక 2017-2018 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను అనేది ఇక ఉండక పోవచ్చు. కేవలం బ్యాంకు లావాదేవీలపైన మాత్రమే ఒక అతి స్వల్ప పన్ను ఉండవచ్చు. అనేక పన్నుల వడ్డింపు రద్దు చేయబడి, కేవలం GST మాత్రమే అమలులో ఉండే ఛాన్స్ ఉంది. జాన్ ధన్ యోజన ఖాతాల్లోకి ఒక్కో ఖాతాకి పదివేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వమే జమ చేయవచ్చు. దీని అమలుకు  సంబంధించి కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిస్తున్నాయి. ఇక చిన్న నోట్ల లభ్యత శాతం మార్కెట్ లో పెరగగానే, నగదు లావాదేవీల పైన గరిష్ట నిబంధన అమలు చేసి,ఇప్పుడున్న 2000 నోట్లను కూడా నెమ్మదిగా నిలిపివేసే అవకాశం ఉంది. 2 నోట్లు తీసుకురావడం వెనక కేంద్రం ఉద్దేశం కూడా ఇదేనన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో వాస్తవానికి 50% లావాదేవీలు అన్నీ, నగదు రూపేణా జరుగుతున్న నేపధ్యంలో.. ప్రభుత్వానికి రావలసిన పన్నులు రావటం లేదు. అందుకే నగదు లావాదేవీల  పరిమితి పదివేల రూపాయలకు పరిమితం చేసి, అందుకు పైబడిన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి చేయొచ్చు. జీతభత్యాలు, వ్యాపార ఖర్చులు అన్ని చెక్కు, నగదు బదలాయింపు ద్వారా మాత్రమే అనుమతించబడవచ్చు. అంతేకాక గరిష్టంగా 50 వేలు దాటిన నగదు లావాదేవీలను ట్యాక్స్ రిటర్ను దాఖలు చేసినప్పుడు దాన్ని ఖర్చులుగా అంగీకరించక పోవచ్చు. నగదు లావాదేవీలు పరిమితం చేయబడిన నేపధ్యంలో ఏదైనా నల్లధనం మిగిలి ఉంటే.. ఆది బంగారం రూపంలోకి మారే అవకాశం ఉంది. అప్పుడు బంగారం దిగుమతి కూడా నిషేధించబడుతుంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తి వద్ద, గరిష్టంగా అయిదు లేక ఆరు వందల గ్రాముల బంగారం మాత్రమే ఉండాలన్న  నిబంధన పెట్టే అవకాశం ఉంది. ఒక వేళ 6 వందల గ్రాములకు పైబడి బంగారం ఉంటే.. దానిపై స్వల్పంగా పన్ను వేసి ఆ బంగారాన్ని అధికారికం చేయొచ్చు. ఆ హక్కుదారు వద్ద ఉన్న బంగారానికి మళ్లీ ఒకరికి విక్రయం జరుపనంత వరకు పన్ను వేయటం ఉండదు. ఇక ఒక నిర్ణీత పద్దతిలో పరిమిత గడువు లోపల.. దేశంలో ప్రతి ఒక్కరూ తమ తమ స్థిర, చర ఆస్తులు మొదలైనవి ఆదాయపన్ను శాఖకి ప్రకటించాలన్న నిబంధన అమలులోకి తీసుకురావచ్చు. గడువు లోపల కూడా ఎవరైనా తమ ఆస్తుల్లో ప్రకటించనివి ఏమైనా ఉంటే అవన్నీ ప్రభుత్వానికే చెందే అవకాశం ఉంది.  నోట్ల రద్దు ముందు వరకు మొత్తందేశ ఆర్ధిక వ్యవస్థలో నగదు లావాదేవీల పరిణామం గరిష్టంగా 50 శాతానికి చేరింది. నగదు లావాదేవీల వల్ల అవినీతి పెరిగిపోయి ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రాకుండా పోతుంది. ఇదంతా స్వార్ధపరుల జేబుల్లోకి, నేలమాళిగల్లోకి చేరిపోతుంది. నిజానికి డబ్బు మార్కెట్లో ప్రతి ఒక్కరి వద్ద చలామణీలో ఉండి, అధికారిక లావాదేవీల మూలంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తేనే… దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పాటు భవిష్యత్ లో చేపట్టబోయే  మరిన్ని సంస్కరణలు ఆ దిశగా ఫలితాలను ఇస్తాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

Loading...
[X] Close