[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్ » క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని…!

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ వేసుకుందని…!

Mohammed Shami Abused Over His Wife's Sleeveless Outfit On Facebook

టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మిపై క్రికెట్ అభిమానుల్లోని ఓ వ‌ర్గం సోష‌ల్ మీడియాలో తిట్ల దండ‌కం అందుకుంది. దీనికి కార‌ణం షమి భార్య హ‌సిన్ జ‌హాన్‌. షమి… భార్య‌, కూతురుతో క‌లిసి ఉన్న ఫొటోల‌ను త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫొటోలో అత‌ని భార్య మోడ‌ర్న్ డ్రెస్ వేసుకోవ‌డంపై ఓ వ‌ర్గం ఫ్యాన్స్ ష‌మిపై మండిప‌డ్డారు.

కొంద‌రు షమికి త‌న మ‌తం గురించి కూడా గుర్తు చేసి, నీ భార్య ముసుగు ఎందుకు ధ‌రించ‌లేదని ప్ర‌శ్నించారు. అయితే ఈ కామెంట్స్‌పై ష‌మి కూడా వెంట‌నే స్పందించి ట్విట్ట‌ర్‌లో త‌న ఫ్యాన్స్‌కు స‌మాధాన‌మిచ్చాడు.

మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్‌ తోపాటు కొంద‌రు అభిమానులు కూడా ష‌మికి మ‌ద్ద‌తుగా నిలిచారు. షమీది చూడ‌ముచ్చ‌టైన కుటుంబ‌మ‌ని కొంద‌రు అన్నారు. ట్విట్ట‌ర్‌లో స్పందించిన కైఫ్‌.. ష‌మికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాన‌ని, ఇలాంటి వ్యాఖ్య‌లు సిగ్గు చేట‌ని తెల్పాడు.

ప్ర‌స్తుతం గాయంతో బాధ‌ప‌డుతున్న ష‌మి.. ఇంగ్లండ్‌తో జ‌రిగిన చివ‌రి రెండు టెస్టుల‌కు దూరమయ్యాడు. వ‌న్డే సిరీస్‌కు కూడా అత‌డు ఆడేది అనుమాన‌మే.

Loading...
[X] Close
Share