[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » సీఎం పై బహిష్కరణ వేటు – IndionNews

సీఎం పై బహిష్కరణ వేటు – IndionNews

mulayam vs akhilesh

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో సమాజ్ వాది పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సాక్షాత్తు యూపీ సీఎంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆపార్టీ అధినేత ములాయం సింగ్ ప్రకటించడం సంచలనంగా మారింది. తండ్రి కొడుకుల మధ్య కొద్ది రోజులుగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సీఎం అఖిలేష్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. అఖిలేష్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, రాంగోపాల్ యాదవ్ పార్టీని దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని ములాయం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఖిలేష్ ను బహిష్కరించడంపై బాధగా ఉన్నా.. పార్టీని బతికించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదని ములాయం అన్నారు. దీంతో అఖిలేష్ సీఎం పదవి ప్రశ్నార్థకమైంది. అయితే అఖిలేష్ క్షమాపణ చెప్తే బహిష్కరణపై ఆలోచిస్తానని ములాయం తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈనేపధ్యంలో శనివారం పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ములాయం ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థుల జాబితాను మూలాయం రెండు రోజుల క్రితమే విడుదల చేయగా.. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అఖిలేష్ మళ్లీ సొంతంగా గురువారం 235 మంది సభ్యుల జాబితాను విడుదల చేశారు.తాను సూచించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ములాయం సీట్లివ్వకపోవడంపై నొచ్చుకున్న అఖిలేష్ తండ్రితో డైరక్ట్ వార్‌కు దిగారు. పోటాపోటీగా తానే జాబితా విడుదల చేసి తన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 171 మందికి సీట్లిచ్చుకున్నారు. దీంతో తండ్రికొడుకుల మధ్య అగ్గిరాజుకుంది. అఖిలేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం, అఖిలేష్ కు షోకాజ్ నోటీసులు పంపించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు ఆయన సోదరుడు రాంగోపాల్ యాదవ్ కు కూడా షోకాజ్ నోటీసులు పంపించారు. ఈ నేపధ్యంలో ఇద్దరిపై తాజాగా బహిష్కరణ వేటు వేశారు. జనవరి ఒకటిన సమాజ్‌వాదీ పార్టీ కార్యవర్గ సమావేశానికి రాంగోపాల్ యాదవ్ పిలుపివ్వడాన్ని కూడా ములాయం తప్పుబట్టారు. పార్టీ అధ్యక్షుడికి తప్ప మరొకరికి కార్యవర్గ సమావేశానికి పిలుపివ్వడం కుదరదని చెప్పారు. ఏదేమైనా.. సీఎం స్థాయిలో ఉన్న అఖిలేష్ పై పార్టీ బహిష్కరణ వేటు వెయ్యడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో యూపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

Loading...
[X] Close
Share