[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » నాగార్జున అందుకు ఒప్పుకుంటాడా…!

నాగార్జున అందుకు ఒప్పుకుంటాడా…!

Nagarjunas shocking look in Raju Gari Gadhi 2

పెళ్లీడుకొచ్చిన కొడుకులు ఉన్నా.. హీరో నాగార్జున గ్లామర్ విషయంలో కుర్రహీరోలకు ఇంకా పోటీ ఇస్తూనే ఉన్నాడు.ఈ సోగ్గాడికి మహిళా ప్రేక్షకుల్లో ఉన్న క్రేజే వేరు. సినిమా  సినిమాకు డిఫరెంట్  స్టైల్స్ తో కనిపించడంలోఈ హీరో తరువాతే ఎవ్వరైనా. నెక్స్ట్ సినిమాకు నాగ్ ఇదే ఫాలో అవుతున్నాడు. అయితే నాగ్ హేయిర్ స్టైల్ ఏంటో తెలిస్తే మీరు షాక్  అవుతారు? ఇంతకీ ఆ షాకింగ్ లుక్ ఏంటి? తెలుసుకోండి మరి. ప్రేక్షకులను  అలరించేందుకు  ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు నాగార్జున. అయితే ఇప్పటివరకు తన లుక్ విషయంలో మాత్రం ఆయన పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడలేదు. కానీ  తొలిసారి ఆయన సినిమా కోసం గుండు కొట్టించుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది2’ సినిమా రూపొందుతోంది. ఇటీవలే  ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో నాగ్ కోసం ఓంకార్ ఓ గెటప్ సిద్ధం చేశాడట. ఫ్రెంచ్ కట్ లాంటి గడ్డం, గుండుతో ఆ పాత్ర లుక్ ఉంటుందట. అయితే  ఇంతటి సాహసానికి నాగ్ ఒప్పకున్నాడా? లేదా అన్నది తెలియదు. ఒక వేళ నాగ్ కోరితే ఓంకార్ పాత్రలో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మరీ, నాగ్  తొలిసారి వెండితెరపై గుండుతో కనిపిస్తాడా? లేదా చూడాలి.

Loading...
[X] Close
Share