[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » అక్కినేని వారసుల పెళ్ళిళ్లలో మరో ట్విస్ట్..!

అక్కినేని వారసుల పెళ్ళిళ్లలో మరో ట్విస్ట్..!

new twist in akkineni sons marriage

అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్‌.. ఈ ఇద్దరిలో ఎవరి పెళ్లి ముందు అంటే? ఇన్నాళ్లు అఖిల్‌ పేరే పినిపించింది. ఆ వార్తలను నిజం చేస్తూ.. అఖిల్, శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సమంతతో ప్రేమలో ఉన్నానని చెప్పిన నాగచైతన్య, వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని చెప్పాడు. కానీ, ఎప్పుడనేది మాత్రం రివీల్ చెయ్యలేదు.అయితే తాజా సమాచారం ప్రకారం… ముందు చైతూ పెళ్లి, ఆ తర్వాతే అఖిల్‌ పెళ్లి జరిపించాలని నాగార్జున అనుకుంటున్నారని తెలుస్తోంది. జనవరి 29న చైతూ, సమంతల నిశ్చితార్థ వేడుకను కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.అయతే అక్కినేని ఫ్యామిలీ ఈ నిశ్చితార్థం వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. చైతూ, సమంతలు సింపుల్‌గా ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట.కానీ,నాగార్జున మాత్రం విదేశాల్లో కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించాలని కోరు కుంటున్నారట! అఖిల్‌శ్రియాల పెళ్లి ఇటలీలో జరగనుందనే విషయం తెలిసింది. అదే విధంగా చైతూ కూడా విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంటే బాగుంటుందని నాగార్జున కోరుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా అఖిల్‌ పెళ్లి కంటే ముందే చైతూ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి లేట్ గా అయినా నాగ్.. సరైన నిర్ణయం తీసుకున్నాడు.

Loading...
[X] Close