[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » పెద్ద నోట్ల రద్దుతో వీళ్ళ పరిస్థితి చూడండి …!

పెద్ద నోట్ల రద్దుతో వీళ్ళ పరిస్థితి చూడండి …!

night-life-after-currency-demonetization

నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్ లో నైట్ లైఫ్ సందడి తగ్గింది. కనీసం వీకెండ్ లోనూ ఆ జోరు కనిపించడంలేదు. పెద్ద నోటు లేకపోవడంతో నైట్ లైఫ్ పై ఆసక్తితగ్గిందంటున్నారు పార్టీ ప్రియులు. పబ్‌లు సైతం వీకెండ్స్‌లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్డు ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు సైతం యువత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫ్యాషన్‌, మోడల్‌ షోలు తగ్గాయి.దీంతో నిర్వాహకులకు భారీగా కోతపడుతోంది. అయితే నైట్  లైఫ్ లేకుండా ఉండలేమనుకుంటున్న కొందరు హౌస్‌ పార్టీలకు తెరతీస్తున్నారు. ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని  జాలీగా పార్టీల్లో
ముగినితేలుతున్నారు. హైదరాబాద్ అంటేనే యాక్టివ్ లైఫ్ కి కేరాఫ్ అడ్రస్. సాఫ్ట్ వేర్ కొలువులు, ఐదంకెల జీతాలు… నైట్ పార్టీలకు అలవాటు పడ్డ జీవితాలు.. దీంతో  బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో పబ్ లు, లాంజ్ లు ప్రారంభయ్యాయి. అయితే..పోలీసుల ఆంక్షల కారణంగా 11 గంటలకే ముగుస్తున్న పబ్ లకు వెళ్లడం చాలామంది
తగ్గించేశారు.ఈ కారణంగా చాలా వరకు మూతపడగా.. కొన్ని మాత్రం కొనసాగుతున్నాయి.  దీనికి తోడు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారం కష్టంగా సాగుతోంది. అయితే నిజానికి నోట్ల రద్దు వల్ల  నైట్ లైఫ్ నిర్వహకులకు నష్టం10-20 శాతం
ఉండవచ్చు. ఎందు కంటే ఇలాంటి జీవితాలకు హాజరయ్యే వారంతా కార్డు ద్వారా మాత్రమే చెల్లింపులు జరుపుతారు. అయితే అడపాదడపా పబ్‌లకు వచ్చే వారు ఇప్పుడురావడం లేదన్నది ఎక్కువ మంది పబ్‌ల నిర్వాహకులు చెబుతున్న మాట. అయితే రెగ్యులర్‌ పబ్‌గోయర్లు మాత్రం నోట్ల రద్దు తర్వాత 40-50 శాతం క్రౌడ్‌ తగ్గిందంటున్నారు. మగవారు అధికంగా కార్డు లావాదేవీలు చేసినా, ఇంట్లో తెలీకుండా పబ్‌లకు వచ్చే వారు మరీ ముఖ్యంగా లేడీస్‌ ఎక్కువగా క్యాష్‌ ఇస్తుంటారని అది ఇప్పుడు పూర్తిగా తగ్గిందంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో జోష్‌ లేకుండా పోయిందంటున్నారు.

Loading...
[X] Close
Share