[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » ఉస్మానియా యూనివర్సిటి లో 50 ఏళ్ల ఆ జ్ఞాపకాలు

ఉస్మానియా యూనివర్సిటి లో 50 ఏళ్ల ఆ జ్ఞాపకాలు

osmania university celebrations

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఉస్మానియా చదువులమ్మ చెట్టునీడలో విద్యా జ్ఞానాన్ని నేర్చుకున్న నేస్తాలు, మళ్లీ ఒక్కసారి ఆత్మీయంగా కలుసుకోబోతున్నాయి. ఒకటా రెండా..  1966లోని  ఆ తీపి జ్ఞాపకాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు. ఓయూలోతమ జ్ఞాపకాలకు ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్. డాక్టర్ పట్టా చేతబట్టి సముద్రాల ఆవల వాలిన ఆ రోజులు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. విద్యాబుద్దులు చెప్పిన గురువులు, స్నేహితుల మధ్య జరిగిన చిలిపి సంగతులు.. ప్రతీది గుర్తే.  ఉద్యోగాలకై సప్త సముద్రాలు దాటినా..  జీవితంలో ప్రయాణంలో ఎన్నో మజిలీలు చూసినా..  చదువులమ్మ ఒడిలో విహరించిన ఆ రోజులు ఇంకా ప్రతీ గుండెలో మెదులుతూనే ఉన్నాయి. గత స్మృతులు, ఎప్పటికీ మధుర స్మృతులే. ఆజ్ఞాపకాల్లోకి మళ్లీ ఒక్కసారి స్వయంగా వెళ్లడం అనిర్వచనీయమైన అనుభూతి.   ఉస్మానియాలో వైద్యవిద్యలో నిష్ణాతులై.. విశ్వ విద్యాలయం ఘనకీర్తిని చాటుతూ.. వైద్యో నారాయణో హరి అన్న భారతీయ భావనలను విశ్వవ్యాప్తం చేస్తున్న వైద్యులు వారంతా. అమెరికా, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇలా ఏ దేశమేగినా.. ఎక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నా.. డిసెంబర్ 10 నుంచి 13 వరకు అంతా రెక్కలు కట్టుకుని వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాలనున్నారు.  ఉస్మానియా -66 గోల్డెన్ జూబ్లీ సమ్మెళనం పేరుతో 3 రోజుల పాటు విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి  ఓయూ విశ్వవిద్యాలయం ముస్తాబైంది. 50 ఏళ్ల కిందటి ఆ జ్ఞాపకాల వైభోగంలో పాలుపంచుకునేందుకు దేశ,విదేశాలలో స్థిరపడ్డ 1966 బ్యాచ్ కు చెందిన వైద్యులందరూ కుటుంబసమేతంగా ఈ  వేడుకకు తరలి వస్తున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించుకోవడం.. ఆ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకోవడంమే కాకుండా  వైద్యవిద్యలో వస్తున్న మార్పులను ఈ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించనున్నారు.

Loading...
[X] Close