[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » పాకిస్తానీ హిందువులకి శుభవార్త…కల నెరవేరనుంది

పాకిస్తానీ హిందువులకి శుభవార్త…కల నెరవేరనుంది

Pakistani Hindus to Get First Temple in Islamabad

పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువులకు గుడ్ న్యూస్. పాక్ లో నివసిస్తున్న హిందూవుల కల నెరవేరనుంది. పాక్ రాజధాని ఇస్లామాబాదులో హిందువులు గత కొంతకాలంగా ఓ దేవాలయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోరాటానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ఇస్లామాబాద్‌లో నివసించే హిందువుల కోసం మొదటి సారిగా దేవాలయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. అందుకోసం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాపిటల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రకటించింది. కాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశంలో ఆలయానికి స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికలో వార్తలు వచ్చాయి. ఇస్లామాబాద్ లో సుమారు 800 మంది హిందువులు నివసిస్తున్నారు. ఆలయం లేక దీపావళి వంటి పెద్ద పండుగలను ఇళ్ల వద్దే జరుపుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఇస్లామాబాద్‌ లో హిందువుల కోసం ప్రత్యేకంగా శ్మశానవాటిక లేదు. మృతి చెందిన వారిని రావల్పిండి లేదా స్వస్థలాలకు తీసుకొచ్చి ఖననం చేయాల్సి వచ్చేది. ఇస్లామాబాద్‌, రావల్పిండి జంటనగరాల్లోని పెద్ద దేవాలయం అంటే సద్దార్‌లో ఉన్న కృష్ణ మందిర్‌ ఒక్కటే. మొత్తానికి ఇస్లామాబాద్ లో హిందూవులకు ఆలయం నిర్మితమవనుండడం.. ఇటు భారత్ తోని హిందూవులకు ఎంతో ఆనందాన్నిస్తోంది.

Loading...
[X] Close
Share