[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » ఈ ట్విట్టర్ రాజకీయాలు ఏంటి పవన్?

ఈ ట్విట్టర్ రాజకీయాలు ఏంటి పవన్?

పవన్ కల్యాణ్ ట్విట్టర్ రాజకీయం తో సంచలనాలను సృష్టిస్తున్నాడు…వరుసగా నాలుగో రోజు కూడా జనసేనాని ట్వీట్స్ చేసారు. ఇప్పటివరకు గోవధ, రోహిత్ మరణం, జాతీయ గీతం, ఏపికి ప్రత్యేక హోదా అంశాలపై ట్వీట్స్ చేసిన పవన్, చివరగా నోట్లరద్దుపై ప్రశ్నించి(ట్వీట్స్) ఈ సిరీస్ ముగిస్తారట. గోవధ, రోహిత్ మరణం, జాతీయ గీతం ఈ మూడు అంశాలపై పవన్ చేసిన ట్వీట్స్ కొంతమందికి నచ్చాయి, కొంతమందిని నోచుకునేలా చేసాయి. ఈ మూడు విషయాల మీద జనసేనాని ట్వీట్స్ లో డెప్త్, క్లారిటీ, బిజెపిని ఎదిరించే ధోరణి కనిపించాయి. ప్రత్యేకహోదా అంశం మీద మాత్రం జనసేనాని క్లారిటీ మిస్ చేశారు.
pawan kalyanతిరుపతిలో నిర్వహించిన సభ నుంచి మొన్నటి అనంతపురం సభదాకా చెప్పిన విషయాన్నే ఇప్పుడు ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పవన్ అభిమానుల్లో,కార్య కర్తల్లో కూడా నీరసం తెప్పించింది. ప్రత్యేకహోదా కార్య సాధనకోసం జనసేనాని ఉద్యమాన్ని ప్రకటిస్తారనుకుంటే బిజెపి ఏ సమాధానం చెప్పాలి అంటూ పాతపాటే పాడారు. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం అని బీజేపీ ప్రకటనలతో స్పష్టం అయిపోయింది. బిజెపి ప్రత్యేకహోదా ఇవ్వదు అని తేలిపోయాక “ఇచ్చిన హామీపై ఎందుకు వెనక్కి వెళ్ళారో చెప్పే వరకు బిజెపిని వదిలిపెట్టబోమని జై ఆంధ్రా ఉద్యమంలో మరణించిన వారి మీద ఒట్టేసి చెప్పడం” వల్ల జనసేనాని సాధించేది ఏమిటి? ఇప్పటికే మాటలు,ట్విట్ల తో రెండున్నరేళ్ళు గడిచిపోయాయి. ఇక ప్రభుత్వానికి మిగిలింది రెండున్నరేళ్ళు, ఇప్పటికైనా ఉద్యమాలు, ఆందోళనలు చేసి హోదాని త్వరగా సాధించుకోవాలి కానీ, అది చేయకుండా ఎన్నిసార్లు ట్వీట్ చేసినా ఉపయోగం ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి బలం లేదు, ఆ పార్టీ అధిష్టానానికి అలాంటి ఆశలు కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే బిజెపి ఆంధ్రప్రదేశ్ కి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చిందని అర్ధం అవుతుంది.మరి అలాంటి బిజెపిని ఒప్పించి, ప్రత్యేకహోదా సాధించుకోవాలంటే కేవలం ట్వీట్స్ సరిపోవు. వీధుల్లో ఉద్యమాలు కావాలి. ఛలోఢిల్లీ అని వేలమంది జనంతో ఢిల్లీ వెళ్లి ఆయన్ని కలిసి తాడోపేడో తేల్చుకోవాలి.. మరి జనసేనాని ఆ పని చేస్తారా? లేదా ట్విట్ల తో నే ఢిల్లీ ని కదిలిస్తాడో చూడాలి మరి…

pawan-kalyan-politics-janasenani

Loading...
[X] Close
Share