[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

pawan kalyan vs tdp chintamaneni prabhakar sensational comments

టీడీపీ ఎమ్మెల్యే – ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కాంట్ర‌వర్సీల కౌంట్ రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా జ‌ర్న‌లిస్టుల‌తో వివాస్ప‌ద రీతిలో వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న అది మ‌ర‌చిపోకుండానే ఇప్పుడు ఏకంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ని టార్గెట్ చేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… గత ఎన్నికల్లో పవన్ ప్రచారం టీడీపీ పార్టీకి గాని తన గెలుపునకు గాని ఏమీ ఉపయోగపడలేదని తేల్చేశారు. `అన్న‌ను గెలిపించుకోలేని వాడు మమ్మల్నేమ్ గెలిపించ‌గ‌ల‌డు?` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ వ‌ల్ల టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేదంటూ తన మాటలతో కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.
ప‌వ‌న్‌పై చింత‌మ‌నేని కామెంట్స్‌తో స్టేట్ వైడ్‌గా జనసేనాని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. చింతమనేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పవన్,మెగా అభిమానులు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. చింత‌మ‌నేని పవన్‌పై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప‌వ‌న్ అభిమాన సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ చింతమనేని తీరు ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న రీతిలో ఉందని వ్యాఖ్యానించారు. చింతమనేనికి అంత దమ్ము ఉంటే ఇపుడు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. ప‌వ‌న్ ఇప్పుడిప్పుడే టీడీపీపై ప్రశ్నలతో తన గొంతు పెంచుతున్నారు. ఈ క్ర‌మంలో చింత‌మ‌నేని వ్యాఖ్య‌లు జ‌న‌సేన వ‌ర్సెస్ టీడీపీ క్యాడ‌ర్ మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెంచేలా ఉన్నాయి.

Loading...
[X] Close
Share