[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » వరల్డ్ న్యూస్ » అమెరికా నుంచి మేం విడిపోతాం..!

అమెరికా నుంచి మేం విడిపోతాం..!

people-protest-against-trump
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడం చాలా మంది అమెరికన్లకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ట్రంప్ తమ అధ్యక్షుడు కాదంటూ పలు చోట్ల నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక హిల్లరీకి ఎక్కువ ఓట్లు పడ్డ కాలిఫోర్నియా రాష్ట్రంలో అయితే ట్రంప్‌ ఎన్నికతో వేర్పాటు వాదం మరోమారు తెరపైకి వచ్చినట్టు ఓ వార్త ట్విట్టర్ లో ఒక జోక్‌ లాగా వైరల్ అవుతోంది. అది జోకే కావచ్చు.. కాని నిజంగానే కాలిఫోర్నియాలో కొందరు అమెరికా నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు.
‘ఎస్‌ కాలిఫోర్నియా’ అనే ఓ బృందం ఇప్పటికే శాక్రిమెంటోలో బుధవారం నాడు ఓ సమావేశాన్ని నిర్వహించింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవడాన్ని బ్రెక్జిట్‌ అన్నట్లుగా తమ రాష్ట్రం విడిపోవడాన్ని ‘కాల్‌ ఎగ్జిట్‌’గా వారు పరిగణిస్తున్నారు. 2020 సం. వరకు అమెరికా నుంచి కాలిఫోర్నియా విడిపోయి మరో కొత్త దేశంగా ఆవిర్భవించేలా చేయడమే వారి ప్రధాన లక్ష్యం.

Loading...
[X] Close
Share