[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » రేసులో మోడీ దూకుడు – డోనాల్డ్ ట్రంప్ కు షాక్

రేసులో మోడీ దూకుడు – డోనాల్డ్ ట్రంప్ కు షాక్

PM Modi Wins Online Reader's Poll for TIME Person of the Year

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016 రేసులో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. ఈ సర్వేకు వచ్చే ఆదివారంతో గడువు ముగియనుంది. ప్రస్తుతం ప్రధాని మోడీ 18 శాతం ఓట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నారు. పాక్ విషయంలో దూకుడుతో పాటు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ దేశాన్నే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయంగా మోడీ నిర్ణయాలపై ప్రశంసలు దక్కాయి. ఇవి సాహసోపేత నిర్ణయాలుగా మేధావులు కొనియాడారు. ఈ క్రమంలోప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్స్ రేస్‌లోనూ మోడీ దూసుకుపోతున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియకు వచ్చే ఆదివారమే  ముగియనుంది. ఈ నెల 7న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంటివారు సైతం మోడీ కంటే వెనుకబడి ఉన్నారు. వారు మోడీకి దరిదాపులో కూడా లేరు. మోడీ టైమ్స్ రీడర్స్ ఛాయిస్ ఓటింగ్‌లో 21 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు. మోడీ తర్వాత స్థానంలో ఒబామా, వికిలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే వీరికి ఇప్పటి వరకు కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే దక్కడం గమనార్హం. దాదాపు 50 లక్షల పైగా మంది టైమ్స్ రీడర్స్ ఓట్ల ఆధారంగా ప్రతీ ఏటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటిస్తారు. 2016 సంవత్సరానికి గాను ఈ అవార్డును దక్కించుకోవడం ప్రధాని మోడీ నల్లేరు మీద నడకే. సమీప ప్రత్యర్థులు ఎవరూ మోడీ ఓటింగ్ శాతానికి చేరువగా లేరు. ఈనేపధ్యంలో మోడీ ఈసారి టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక అవుతారనడంలో ఎలాంటి సందేహంలేదు.

Loading...
[X] Close