[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » రాజమౌళికి దూరమవుతున్న ప్రభాస్…!

రాజమౌళికి దూరమవుతున్న ప్రభాస్…!

prabhas is going to say goodbye to baahubali in december

ప్రభాస్ త్వరలోనే హాయిగా ఊపిరిపీల్చుకోనున్నాడు. ఇంట్లో వాళ్లతో సరదాగా గడపనున్నాడు. అంతేకాదు త్వరలోనే పెళ్లి విషయంపై కూడా ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వనున్నాడు.  బాహుబలి కోసం నాగుగేళ్లకు కష్టపడుతున్న ప్రభాస్ కు అంత ఫ్రీడమ్ ఎక్కడిదనే కదా మీ డౌట్. మ్యాటర్ ఏంటంటే.. బాహుబలి కంక్లూజన్ షూటింగ్ కు త్వరలోనే ముగియబోతుంది. దీంతో ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులందరికి విముక్తి కల్గనుందట. దాదాపు నాలుగేళ్లుగా ఒకే ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న ప్రభాస్.. డిసెంబర్ 27తో బాహుబలి షూటింగ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడట. డిసెంబర్ 27న జరిగే చివరి షెడ్యూల్‌తో మూవీ షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై ప్రభాస్ దృష్టి పెట్టడంతో పాటు రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్‌తో ఓ మూవీలో నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. 2013 లో మిర్చి మూవీలో నటించిన ప్రభాస్…  ఆ తరువాత బాహుబలి మూవీపైనే దృష్టి పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి ప్రభాస్ బాహుబలి కోసం  కుటుంబసభ్యులను, పెళ్లిని కూడా త్యాగం చేశాడు.  డిసెంబర్ 27 తరువాత  ప్రభాస్ కు బాహుబలి విషయంలో చాలా వరకు బరువు బాధ్యతలు తీరబోతున్నాయి. ఆ తరువాత కొద్ది నెలల గ్యాప్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టనున్నాడు. అయితే అన్నీ కుదిరితే.. ఈ గ్యాప్ లోనే ప్రభాస్ ఓ ఇంటివాడయ్యే సూచనలున్నాయి.

Loading...
[X] Close