[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » పవన్ కళ్యానేం చిన్నపిల్లాడు కాదు…! ఇంక ఆయనిష్టం మరి

పవన్ కళ్యానేం చిన్నపిల్లాడు కాదు…! ఇంక ఆయనిష్టం మరి

Ram Charan SENSATIONAL COMMENTS ON Pawan Kalyan - FACEBOOK LIVE CHAT VIDEO

ఫేస్‌బుక్‌ వేదికగా పలు అంశాలపై రాం చరణ్‌ స్పందించారు. చిరంజీవి ఖైదీ no 150వ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహిస్తున్నట్టు రాం చరణ్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఒక అభిమాని… పవన్‌ కల్యాణ్‌ పంక్షన్‌కు వస్తారా అని ప్రశ్నించగా చరణ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు. ” ఇదొక బిగ్ క్వశ్చన్‌. ఆయనను కలవడానికి వెళ్తున్నా. మీకు ముందే చెప్పా. పిలవడానికి ఆయనేం చిన్నపిల్లాడు కాదు. ఇన్విటేషన్ ఇవ్వడం వరకే మన బాధ్యత. రావాలా వద్దా అన్నది ఆయనే డిసైడ్ చేసుకుంటారు” అని వ్యాఖ్యానించారు.

ఈ వేడుకకు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులే ముఖ్యఅతిథులని చరణ్‌ ప్రకటించారు. వీరితో పాటు చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఈ వేడుకకి వస్తారని చరణ్ తెలిపాడు. రాంచరణ్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌ ఈ ఫంక్షన్‌కు వచ్చే సూచనలు కనిపించడం లేదంటున్నారు. పైగా ముఖ్య అతిథులుగా దాసరి, రాఘవేంద్రరావును ప్రకటించిన తర్వాత పవన్‌ వస్తారా అన్నది బిలియన్ మార్క్ క్వశ్చనే.

Loading...
[X] Close
Share