[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Breaking News
Home » మిస్టరీ హిస్టరీ » రోల్స్ రాయ్స్ కి చెంప చెల్లుమనిపించిన ‘ఇండియన్ రాజు’ …!

రోల్స్ రాయ్స్ కి చెంప చెల్లుమనిపించిన ‘ఇండియన్ రాజు’ …!

rolls royce vs indian king

భారత దేశానికీ చెందిన అల్వార్ సంస్థాన మహారాజు ఐన జయసింహ ఓ సారి లండన్ విహారయాత్ర కు వెళ్ళినప్పుడు అక్కడ ఓ రోల్స్ రాయ్స్ షోరూం చూసారు. వెంటనే ఆ కార్ ధర మరియు ఇతర వివరాలు కనుక్కుందాం అని లోపలికి వెళ్లి అడిగే సరికి, సాధారణ దుస్తుల్లో అతి సాధారణంగా కనిపిస్తున్న మన చక్రవర్తి ని చూసి అక్కడున్న రోల్స్ రాయ్స్ యాజమాన్యం… మన చక్రవర్తి ని ఒక పేద ఇండియన్ వి నువ్వేం కొనగలవు ఈ కార్ ని అంటూ అవమానించారు.

హోటల్ గదికి అవమానంతో తిరిగివెళ్ళిన చక్రవర్తి తన సిబ్బందిని రోల్స్ రాయ్స్ షోరూం లో ఉన్న అన్ని కార్లను కొంటానని రాయబారం పంపాడు. అప్పుడు రాజ మర్యాదలతో షోరూం కి చేరిన మన దేశ రాజా వారిని చూసి అక్కడున్న సిబ్బంది షాక్ తింది. వెంటనే షోరూం లో ఉన్న 6 రోల్స్ రాయ్స్ కార్లని ఇండియా కి పంపాలని డబ్బు చెల్లించి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి ఆ కార్లు ఇండియా కు చేరాయి. చక్రవర్తి వెంటనే మున్సిపల్ అధికారుల్ని పిలిపించి ఈ కార్లని తక్షణమే చెత్త జారవేయడానికి ఉపయోగించాల్సిందిగా వారికి ఆదేశాలు జారి చేసాడు. ఈ వార్త అప్పట్లో ప్రపంచమంతా సంచలనమైంది. ఈ వార్త తెలుసుకున్న రోల్స్ రాయ్స్ కంపెనీ అధికారులు ఇండియా చేరుకుని… మన చక్రవర్తి వారిని క్షమించమని ఇంకో 6 కార్లు ఉచితంగా ఇచ్చివెంటనే ఈ పని ని ఆపవలసిందిగా విన్నవించుకున్నారు. అది గురు మన ఇండియన్స్ ఘన చరిత్ర.

Loading...
[X] Close
Share