[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » సంపూర్ణేష్‌ బాబుని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

సంపూర్ణేష్‌ బాబుని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

sampoornesh babu arrested in visakhapatnam

ప్రత్యేక హోదా కోరుతూ యువత చేపడుతున్న మౌనదీక్షకు మద్దతుగా విశాఖ వచ్చిన సినీ హీరో సంపూర్ణేష్‌ బాబును పోలీసులు అరెస్టు చేశారు. సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి విశాఖ చేరుకున్న సంపూర్ణేష్‌ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. పోలీసులు విశాఖ బీచ్‌ రోడ్డులో కఠిన ఆంక్షలు విధించడం, యువతను నిర్భందించడం యువత విజయమేనని సంపూర్ణేష్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ యువత చేస్తున్న శాంతియుత దీక్షకు మద్దతు ప్రకటించడానికే తాను విశాఖ పట్టణానికి వచ్చినట్లు సంపూర్ణేష్ తెలిపారు.

Loading...
[X] Close
Share