[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » ‘జియో’ పై చేసిన సర్వేలో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు…!

‘జియో’ పై చేసిన సర్వేలో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు…!

shocking survey reports on reliance jio feature

ప్రస్తుతం టెలికాం రంగంలో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది జియో. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ అంటూ కోట్ల సంఖ్యలో కస్టమర్స్ ను రాబట్టుకుంది. దీంతో నిన్న,మొన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న టాప్ టెలికామ్ సంస్థలు మూతి ముడుచుకున్నయ్. అయితే జియో నుంచి డేటా, కాల్ సర్వీసులు కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉచితం అని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై జరిపిన ఒక సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేవలం ఫ్రీ ఉన్నంత వరకు మాత్రమే జియోను వినియోగించి, ఆ తరువాత మాత్రం మిగిలిన పెద్ద టెలికామ్ సంస్థల సర్వీసులనే వాడనున్నారట ప్రజలు.

దీన్ని బట్టి చూస్తే..ప్రస్తుతం ఉన్న కోట్ల యూజర్లు కూడా ఏప్రిల్ వరకు మాత్రమే అంటున్నారు. ఆ తరువాత ఫ్రీ సర్వీస్ ఎత్తివేసి డబ్బు పెట్టి రీచార్జ్ చేయించే సమయానికి జియో గ్రాఫ్ అమాంతం పడిపోవడం ఖాయం అని చెప్తున్నారు. దీనికి తోడు చాలా చోట్ల అంబానీ గారి ‘జియోకు’ సరైన నెట్వర్క్ లేకపోవడంతో చిరాకుపడుతున్న కస్టమర్స్, ఏదో ఫ్రీ కాబట్టే దాన్ని వేడేస్తున్నారు కానీ, ఫ్రీ బోర్డు ఎత్తేస్తే జియో జోలికి వెళ్ళే వాళ్ళే లేరట! మరి ఇలాంటి వాటిని అంబానీ గారు ఫ్యూచర్ లో ఎలా అధిగమిస్తారో చూడాలి మరి.

Loading...
[X] Close
Share