[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » శృతి హాసన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా?

శృతి హాసన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా?

Shruti Hassan Dating With Young Musician

కమల్ హాసన్ నట వారసురాలిగా వెండితెరపై తెరంగేట్రం చేసింది శృతి హాసన్. కేవలం నటనతోనే కాకుండా సంగీతం, డ్యాన్స్ విభాగాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్, ఆ తరువాత తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి సత్తా చాటింది. పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్‌ మూవీతో శృతిహాసన్ కెరియర్ ఊపందుకుంది. అదే సెంటిమెంట్ తో ఇపుడు మరోమారు పవర్ స్టార్ తో కాటమరాయుడలో జోడికట్టింది. అయితే ఇటీవల శృతిహాసన్ పై డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ తో శృతి పీకల్లోతు ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజంలేదని ఆ తరువాత క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా ఈ భామపై మరోసారి డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. రీసెంట్ గా కాటమరాయుడు’ మూవీ షెడ్యూల్ పొల్లాచ్చిలో పూర్తయింది. ఇలా షెడ్యుల్ పూర్తయ్యిందో లేదో, శృతిహాసన్ లండన్‌కు చెక్కేసిందట. దీనికి కారణం.. అక్కడే ఓ యంగ్ మ్యుజిషియన్‌తో శృతి డేటింగ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే అలాంటిది ఏమీ లేదని, కొత్త మ్యూజిక్ ఆల్బం రూపొందించడం కోసమే తరచుగా లండన్ వెళ్తున్నానంటోంది శృతి. అయితే న్యూ మ్యూజిక్ ఆల్బం పేరు చెప్పి, డేటింగ్ విషయాన్ని శృతిహాసన్ కవర్ చేస్తోందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇటీవల శృతిహాసన్ పై డేటింగ్ వార్తలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి.

Loading...
[X] Close
Share