[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: BJP

Tag Archives: BJP

అమ్మకు నివాళులు అర్పించలేకపోయిన రాష్ట్రపతి

Pranab Mukherjee Will Not Attend Jayalalithaa Funeral

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అనేక మంది ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహా  తమిళనాడు ఇంఛార్ట్ ముఖ్యమంత్రి విద్యాసాగర్ రావు, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమ్మకు నివాళులు  అర్పించినవారిలో ఉన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమ్మకు నివాళి అర్పించేందుకు బయలుదేరినప్పటికీ, ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక  లోపం తలెత్తడంతో చెన్నై రాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానం చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. ప్రణబ్  భారత వైమానిక దళానికి ...

Read More »

ఆర్బీఐ గవర్నర్ జీతం ఎంతో తెలుసా..!?

shocking-salary-of-rbi-governor-urjit-patel-rbi-governors-salary

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్‌లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.  ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాల 2 లక్షలట. ఆయన రెండు కార్లు వినియోగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు డ్రైవర్లుఉన్నారు.  సెప్టెంబర్‌ ఆరో తేదీన గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన ఉర్జీత్ పటేల్‌ అక్టోబర్‌ నెల వేతనంగా 2.09లక్షలు అందుకున్నారు. 2013 సెప్టెంబర్‌ 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి ...

Read More »

రేసులో మోడీ దూకుడు – డోనాల్డ్ ట్రంప్ కు షాక్

PM Modi Wins Online Reader's Poll for TIME Person of the Year

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016 రేసులో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. ఈ సర్వేకు వచ్చే ఆదివారంతో గడువు ముగియనుంది. ప్రస్తుతం ప్రధాని మోడీ 18 శాతం ఓట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నారు. పాక్ విషయంలో దూకుడుతో పాటు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ దేశాన్నే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయంగా మోడీ నిర్ణయాలపై ప్రశంసలు దక్కాయి. ఇవి సాహసోపేత నిర్ణయాలుగా మేధావులు కొనియాడారు. ఈ క్రమంలోప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్స్ ...

Read More »

నల్ల బాబులపై ‘మోదీ’ సర్కార్ మాస్టర్ ప్లాన్

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పుడు మోడీ  ప్రభుత్వం ఏం చేయబోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర కాల పరిధి వచ్చే ఏడాది మార్చ్ వరకు కొనసాగనుంది.. అయితే నోట్ల రద్దు కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఈ కాల పరిధిని కేంద్రం 2017 డిసెంబర్ వరకు పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివర్లో వెలువడే అవకాశం ఉంది.   ఇక 2017-2018 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను అనేది ఇక ఉండక పోవచ్చు. కేవలం బ్యాంకు లావాదేవీలపైన మాత్రమే ...

Read More »

పాకిస్థాన్‌ కు అమెరికా మద్దతు!

america supports pakistan

ఉగ్రవాదంపై పోరుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా… పాకిస్తాన్ ను కోరింది. వేరే దేశంపై ఉగ్రదాడులను చేసేందుకు ఏ దేశమూ ఉగ్ర సంస్థలకుఆశ్రయం ఇవ్వకూడదని.. అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ భద్రతా దళాలు చేస్తున్న పోరాటంలో కొందరు సైనికులతోపాటు.. సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని.. వారి ప్రాణ త్యాగాలను తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చేసే పోరుకు అమెరికా మద్దతిస్తుందని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Read More »

బీజేపీ లో అవివాహితులెక్కువ: రాందేవ్‌ బాబా

baba-ram-dev-on-modis-move-against-black-money

బీజేపీ లో ఎక్కువగా పెళ్ళికాని వారే ఉన్నారని అందుకే ఇది పెళ్ళిళ్ల సీజన్‌ అని వారు గ్రహించలేక పోయారని.. అదే తప్పు అని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా అన్నారు. నోట్ల రద్దు ప్రభావం వివాహ శుభకార్యాలపై ఎక్కువగా ప్రభావం చూపడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మరో 20 లేదా నెల రోజులు ఆగి ఈ పని చేసి వుంటే.. పెళ్ళిళ్ళ సీజన్‌ ముగుస్తుంది కాబట్టి వాటిపై ఇంత ప్రభావం పడేది కాదు. అయితే ఇప్పటికీ ఇందులో ఒక మంచి విషయం ...

Read More »

సుష్మాస్వరాజ్ రెండు కిడ్నీలు విఫలo

sushma-swaraj-suffers-kidney-failure

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె 2 కిడ్నీలు విఫలమయ్యాయి. తనకుప్రస్తుతం డయాలసిస్ జరుగుతోందని.. ఇందుకోసం తాను ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నానని సుష్మా స్వరాజ్స్వయంగా తెలిపారు. మూత్రపిండాల మార్పిడికి పరీక్షలు జరుగుతున్నాయని.. కనీసం ఒక కిడ్నీ మార్చవలసి ఉంటుందనివైద్యులు తెలిపారని సుష్మా స్వరాజ్ తెలిపారు. అయితే తన ఆరోగ్యంపై ఎలాంటి దిగులు చెందోద్దని కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా ఆమె ట్వీట్ చేశారు. శ్రీ కృష్ణ భగవానుడు తనను కాపాడతాడన్న నమ్మకముందని ట్వీట్ లో పేర్కొన్నారు.

Read More »

బాబోయ్ 2రోజుల్లో పేద‌ల ఖాతాల్లోకి చేరిన 1000కోట్ల డబ్బు

black-money-is-transferring-into-poor-people-accounts-to-make-white

కేంద్రం అనూహ్యంగా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డాన్ని న‌ల్ల కుబేరులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారి దగ్గ‌ర ఉన్న న‌ల్ల‌డ‌బ్బును ఎలాగైనా తెల్ల‌గా మార్చ‌డానికి ఎన్నెన్నో ఎత్తులేస్తున్నారు. ఉత్తర ఆంధ్ర లోని కొందరు పెద్దలు తమ దగ్గరున్న నల్లధనాన్ని పేదల రూపంలో బ్యాంకులకు చేరవేస్తున్నారు. గడచిన 2 రోజులుగా ఆయా జిల్లాల్లో వెయ్యి కోట్లకుపైగా డబ్బు బ్యాంకుల్లో జమ కావడమే ఇందుకు నిదర్శనం. బ్యాంకుల్లో నేరుగా వేయడంతోపాటు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్ల(CDM)నూ విపరీతంగా వినియోగిస్తున్నారు. అనూహ్యంగా ఒకేసారి రూ.1,000, 500 నోట్లు రద్దుకావడం వైజాగ్, శ్రీకాకుళం, ...

Read More »

రాహుల్ గాంధీతో కాజల్ డేటింగ్ ?

kajal-agarwal-dating-with-rahul-gandhi

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడా? అంటే మీడియా వర్గాల్లో ఇదే టాపిక్ విపరీతమైన చర్చలకు దారితీస్తోంది. పెళ్ళి విషయంలో ఇంతవరకూ నోరు మెదపని రాహుల్ ఇన్నాళ్లకు తన మనస్సును మార్చుకున్నాడని సమాచారం. పెళ్లి చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాడట. దీంతో ఈ 46 ఏళ్ల సొట్టబుగ్గల అందగాడికి కాబోయే వధువు కోసం వెతుకుతున్నారట. అంతే కాదు ఇటీవల రాహుల్ తల్లి సోనియా గాంధీ ఓ సంబంధం చూసినట్టుగా.. ఎన్నికల తర్వాత పెళ్లి జరుగుతున్నట్లుగా రూమర్లు కూడా వచ్చాయి. కానీ, ఈ ...

Read More »

బ్ర‌హ్మ‌చారిని అని అమెరికా వీసా ఇవ్వ‌లేదు !

baba-ramdev-america-visa

యోగా గురువు బాబా రాందేవ్ కు ఒక‌ప్పుడు బ్ర‌హ్మ‌చార‌ని.. బ్యాంకు ఖాతా లేద‌ని అమెరికా వీసా ఇవ్వ‌డానికి నిరాక‌రింద‌ని తెలిపారు. కాగా ప్రస్తుతం ఆయన రూ.4,500 కోట్ల విలువైన పతంజలి గ్రూప్‌ సంస్థలను నడిపిస్తుండటం విశేషం. అయితే ఆ తర్వాత న్యూయార్క్‌ లో ఓ సభలో ప్రసంగించాలని అమెరికా తనను ఆహ్వానిస్తూ పదేళ్ల వీసా మంజూరు చేసిందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఓ సమావేశంలో రాందేవ్‌ ఆయన తొలి వీసా అనుభవం గురించి గుర్తుచేసుకున్నారు. ‘అమెరికా వీసా కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు నిరాకరించారు… ...

Read More »

పాకిస్తాన్ తో ఆ డీల్ వాస్త‌వ‌మే: చైనా

pakistan-with-china

చైనాకు కావ‌ల‌సిన దేశాల్లో పాకిస్తాన్ ఒక‌టి. పాక్‌ నుంచి ‘స‌బ్ మెరైన్లు’ విక్ర‌యించేందుకు తమకు ఉన్న ఒప్పందం వాస్త‌వ‌మేన‌ని చైనా అంగీక‌రించింది. ఈ మేరకు చైనా మిలిటరీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఒప్పందానికి చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ‘హు వెన్మింగ్’ అంగీకరించినట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది. పాకిస్థాన్ కు 8 ‘ఎటాక్ సబ్ మెరైన్ల’ విక్రయానికి సంబంధించి సుమారు 5 బిలియన్ డాలర్లతో బీజింగ్ మిలిటరీ కుదుర్చుకున్న అతిపెద్ద ...

Read More »

అభిమాని కోరిక తీర్చిన ప్రధాని మోడీ

narendra-modi

తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వస్తోందని తెలియగానే ఏ దంపతులైనా ఆనందంలో మునిగితేలుతారు. ఇక పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలి.. ఎలాంటి బట్టలు కొనాలి అని రకరకాల ఆలోచనలలో ఉంటారు. తమ చిన్నారికి చక్కని పేరు పెట్టేందుకు తెగ వెతికేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ దంపతులు మాత్రం తమకు పుట్టబోయే బిడ్డకు ఏకంగా ప్రధాన మంత్రి నామకరణం చేయాలని భావించారు. ‘మా పాపకు పేరు పెట్ట’మని కోరుతూ ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. అయితే వారి ఆకాంక్షను ప్రధాని ...

Read More »
[X] Close