[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: indion news (page 30)

Tag Archives: indion news

2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా : ప‌వ‌న్ కళ్యాణ్

pawan-kalyan-confirms-contesting-in-2019-elections-as-mla

అనంతపురంలో జరిగిన ‘జనసేన’ ‘సీమాంధ్ర‌హ‌క్కుల చైత‌న్య సభ’లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఏ ప్రాంతంలో ఏ కులంలో పుట్టానో నేను ప‌ట్టించుకోను… కులాలు, మ‌తాల‌కు అతీతంగా నేను పోరాటం చేస్తానని అన్నారు. స్పెష‌ల్ ప్యాకేజీ గురించి చ‌దివి నాకు సైటు కూడా వచ్చింది.2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. ‘నాకు ఓట్లు వేయ‌ండి.. వెయ్యకపోండి’. మీరు నాకు అండ‌గా ఉన్నా లేక‌పోయినా నేను మీకు అండ‌గా ఉంటాను’ అని జనసేనాని అన్నారు.

Read More »

ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో తుపాకుల మోత

anti-trump-rally-protests

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా సీటిల్ నగరంలో జరిగిన ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో 5 మంది గాయ‌ప‌డ్డారు. కొంత మంది వ్యక్తుల మధ్య వాగ్వాదమే ఈ సంఘటనకు కారణమని సమాచారం. ఆ ర్యాలీలో ఉన్న వ్యక్తితో గొడవ పడిన మరో వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ర్యాలీ వద్దే ఉన్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడినవారిని హాస్పిటల్ కి ...

Read More »

మోడీపై విరుచుకుప‌డ్డ అసదుద్దీన్ ఒవైసీ.!

modi-vs-asaduddin-owaisi-on-currency-ban

రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై MIM అధినేత MP అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్రధాని మోడీ నిర్ణయంతో రోజువారి కూలీలు, డ్రైవర్లు, మెకానిక్‌లు.. వంటి వారితో ముడి పడే అంశాన్ని పట్టించుకోకుండా ఓ దారుణమైన పరిస్థితి కల్పించారంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. దేశంలో 2% మాత్రమే క్యాష్‌ లెస్ ట్రాన్సక్షన్స్ లు మాత్రమే జరుగుతున్నాయని ఆయన అన్నారు. అంతేకాకా వారి కోసం మిగతా 98% ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అసదుద్దీన్ ...

Read More »

RBI మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..!

rbi-sensational-decision

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే నేటి నుంచి కొత్త నోట్లను జారీ చేస్తుండటంతో కాస్త ఇబ్బంది తగ్గనుంది. కానీ బ్యాంకుల్లో రెండు వేల రూపాయల కొత్త నోట్లు మాత్రమే ఇస్తారు. మరి చిల్లర పరిస్థితి ఏంటి? రూ.500, రూ.1000 రూపాయలు రద్దు చేయడంతో ప్రజలు చిన్న నోట్ల కోసం ఎగబడుతున్నారు. ఇలాంటి వారి కోసం RBI ఒక నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. అన్ని ATM సెంటర్లలో 50 ...

Read More »

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

Reliance Jio to Launch India's Cheapest DTH Service

జియోతో పెను సంచలనం సృష్టించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ఇప్పుడు ఇంకో సంచలనానికి తెరతీయబోతున్నాట్లు సమాచారం. కేవ‌లం ఒక ప్ర‌క‌ట‌న‌తో అన్ని టెలికాం కంపెనీలకు ముఖేష్ అంబాని దడ పుట్టించాడు. ఈసారి మధ్య తరగతి వర్గాలను కూడా ఆకట్టుకునేందుకు పలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం మొబైల్ వినియోగదారులకు సంబంధించినది కాదట.. DTH రంగంలోకి రిలయన్స్ JIO అడుగుపెట్టనుంది. మొదటిలోనే ఇతర DTH కంపెనీలను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో ఏ DTH సర్వీస్ ...

Read More »

నోట్ల మార్పిడీపై కంట్రోల్‌ రూంలు ఏర్పాటు

500-and-1000-rupee-notes-exchange

కేంద్రం రూ.500,1000 నోట్లను రద్దు చేయడంతో ఏర్పడే పరిణామాలపై ప్రత్యేక కంట్రోల్‌ రూం లను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూంలను అందుబాటులోకి రానున్నాయి. ముంబై రిజర్వు బ్యాంకు, ఢిల్లీ వాణిజ్య వ్యవహారాల విభాగంలో 2 కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. మొదట 15 రోజులు 24 గంటలకు పాటు ఇవి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఢిల్లీ కంట్రోల్‌ రూం ఫోన్ నెంబర్‌ 011 2309 3230, ముంబై కంట్రోల్‌ రూం నెంబర్లు 022 2260 2201, 022 2260 2944 ...

Read More »

ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

modi-wishes-donald-trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అమెరికా 45వ దేశాధ్యక్షుడి గా ఎన్నికైన ట్రంప్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో భారత్ పై స్నేహపూర్వకమైన భావనను ఆయన వ్యక్తపరచడాన్ని మోదీ కొనియాడారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానాలకు చేరతాయని ఆశిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.

Read More »
[X] Close