[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » Tag Archives: Modi

Tag Archives: Modi

ఆర్బీఐ గవర్నర్ జీతం ఎంతో తెలుసా..!?

shocking-salary-of-rbi-governor-urjit-patel-rbi-governors-salary

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్‌లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.  ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాల 2 లక్షలట. ఆయన రెండు కార్లు వినియోగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు డ్రైవర్లుఉన్నారు.  సెప్టెంబర్‌ ఆరో తేదీన గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన ఉర్జీత్ పటేల్‌ అక్టోబర్‌ నెల వేతనంగా 2.09లక్షలు అందుకున్నారు. 2013 సెప్టెంబర్‌ 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి ...

Read More »

పాకిస్థాన్‌ కు అమెరికా మద్దతు!

america supports pakistan

ఉగ్రవాదంపై పోరుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా… పాకిస్తాన్ ను కోరింది. వేరే దేశంపై ఉగ్రదాడులను చేసేందుకు ఏ దేశమూ ఉగ్ర సంస్థలకుఆశ్రయం ఇవ్వకూడదని.. అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని అమెరికా స్ప‌ష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ భద్రతా దళాలు చేస్తున్న పోరాటంలో కొందరు సైనికులతోపాటు.. సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని.. వారి ప్రాణ త్యాగాలను తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చేసే పోరుకు అమెరికా మద్దతిస్తుందని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Read More »

మీ బ్యాంక్ లాకర్ లొ బంగారం ఉందా.. ఐతే ఇది మీకోసమె

pm-modis-surgical-strike-on-lockers

నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత బ్యాంకుల్లోని లాకర్లలో ఖాతాదారులు దాచుకున్న బంగారం, న‌గ‌దుపై తాము ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు వ‌చ్చిన పుకార్లను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఖండించింది. బ్యాంకు లాకర్లపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్ప‌ష్టం చేసింది. బ్యాంకు లాక‌ర్ల‌కు సీల్ వేసే ఆలోచ‌న త‌మ‌కు లేద‌ని లాక‌ర్ల‌లో దాచుకున్న‌ బంగారాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచ‌న కూడా త‌మ‌కు లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

Read More »

మార్కెట్లో నకిలీ 2 వేల నోట్లు.. షాకింగ్ స్టోరీ

india-fake-2000-inr-note-found-fake-vs-original-2000-inr-note

RBI విడుదల చేసిన కొత్త 2వేల నోటు ఇంకా జనాల జేబుల్లోకి పూర్తిగా రాలేదు. కాని రెండు వేల నకిలీ నోట్లు మాత్రం అప్పుడే మార్కెట్లోకి వచ్చేశాయి. తాజాగా కర్నాటక లోని చిక్ మంగళూరులో ఓ దొంగ నోటు తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ రైతు మార్కెట్లో తన పంటను అమ్మగా దాన్ని కొన్న వ్యక్తి రూ. రెండు వేల నోటు ఇచ్చాడు. ఆ నోటును అనుమానంగా చూసిన రైతు తన స్నేహితులకు చూపించాడు. దీంతో అది నకిలీ నోటని తేలింది. కొత్త 2 ...

Read More »

ఆర్నేళ్ల క్రితమే పెద్ద నోట్ల రద్దుకు బీజం

500-and-1000-currency-notes-banned-planning-from-6-months

మోడీ సర్కార్ గట్టుచప్పుడు కాకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారికంగా ప్రకటించే వరకు విషయం కాస్త కూడా, లీక్ కాలేదంటే మోడీ పాలనా దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒక వారంలోనో, నెలలోనో జరిగింది కాదు. దాదాపు ఆర్నెళ్ల కిందనే నోట్ల రద్దుకు బీజం పడింది. ప్రధాని మోడీ, ఆయన ముఖ్య కార్యదర్శి తొలిసారి ఆర్నేళ్ల కింద నోట్లపై చర్చించారట. ఆ తరువాత ఈ విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ కు చెప్పారట. ...

Read More »

సీక్రెట్ ఆపరేషన్ కోసం పది నెలలు కష్టపడ్డా: మోడీ

modi-worked-hard-for-10months-on-currency-ban-secret-operation

భారత్ లో బ్లాకు మనీ ని అరికట్టేందుకు ‘సీక్రెట్ ఆపరేషన్’ చేసేందుకు 10 నెలలు కష్టపడ్డానని ప్రధాని మోడీ అన్నారు. నేడు ఆయన గోవాలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. నల్లధనం ఎక్కడెక్కడ ఉందో సుప్రీంకోర్టు నిపుణులతో తెలుసుకున్నానని.. నేను తప్పు చేస్తే నన్ను నిలువునా చీల్చేయండన్నారు. ఉన్నత పదవులు అనుభవించేందుకు నేను పుట్టలేదు.. సామాన్య జనం తరపున నల్లధనంపై యుద్ధం ప్రకటించానని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జనం ఎంతో ఓర్పుతో క్యూ లైన్ లో నిలబడి నోట్లు మార్చుకుంటున్నారని తెలిపారు. యాబై రోజుల ...

Read More »

గంగానదిలోకి కొట్టుకొచ్చిన నోట్ల క‌ట్ట‌లు!

black-money-found-in-ganga-river

మోడీ సర్కారు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డం వల్ల న‌ల్ల‌కుబేరుల‌పై ఆ ప్ర‌భావం బాగానే చూపింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలి లో గంగానదిలోకి రూ.500, 1000 నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు విసిరేశారు. దీంతో మీర్జాపూర్ వద్ద నదిలో వేలాది నోట్లు తేలియాడుతూ దర్శనమిచ్చాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివెళ్ళారు. కాగా కొందరు స్థానికులు పడవలపై, ఇంకొంత మంది ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ నోట్లను పట్టుకున్నారు. ఈ నోట్లలో కొన్ని కాలిపోయి ఉండగా, మరికొన్ని నోట్లు చిరిగిపోయాయి అయితే ...

Read More »

నోట్ల మార్పిడీపై కంట్రోల్‌ రూంలు ఏర్పాటు

500-and-1000-rupee-notes-exchange

కేంద్రం రూ.500,1000 నోట్లను రద్దు చేయడంతో ఏర్పడే పరిణామాలపై ప్రత్యేక కంట్రోల్‌ రూం లను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూంలను అందుబాటులోకి రానున్నాయి. ముంబై రిజర్వు బ్యాంకు, ఢిల్లీ వాణిజ్య వ్యవహారాల విభాగంలో 2 కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. మొదట 15 రోజులు 24 గంటలకు పాటు ఇవి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఢిల్లీ కంట్రోల్‌ రూం ఫోన్ నెంబర్‌ 011 2309 3230, ముంబై కంట్రోల్‌ రూం నెంబర్లు 022 2260 2201, 022 2260 2944 ...

Read More »

ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

modi-wishes-donald-trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అమెరికా 45వ దేశాధ్యక్షుడి గా ఎన్నికైన ట్రంప్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో భారత్ పై స్నేహపూర్వకమైన భావనను ఆయన వ్యక్తపరచడాన్ని మోదీ కొనియాడారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానాలకు చేరతాయని ఆశిస్తున్నానని మోదీ పేర్కొన్నారు.

Read More »

పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్

case-against-5001000-rs-notes-ban

దేశంలో 500, 1000 నోట్ల ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలుగు రాష్ట్రాల హై కోర్టులో అడ్వొకేట్ P.V కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం ప్రభుత్వం నిర్ణయం వల్ల దేశంలో ఆర్థిక అనిశ్చితి పెరిగిందని, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని.. తగినంత చిల్లర నోట్ల ను అందుబాటులో ఉంచకుండానే ఈ నోట్ల రద్దును తెరపైకి తెచ్చారని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. RBI యొక్క నిబంధనలను పట్టించుకోకుండా నోట్లను రద్దు చేశారని తన పిటిషన్ ...

Read More »

పాకిస్తాన్ పై జాలి చూపిస్తున్న భారత్

india-on-pakistan-bomb-attack

పాకిస్థాన్ బుద్ధి చెడ్డదని తెలిసినా.. తరచు కవ్వింపు కాల్పులకు తెగబడుతున్నా.. ముష్కరులను భారత్ పైకి ఎగదోస్తున్నా మన దేశం మాత్రం అయ్యో పాపం అని పాకిస్తాన్ పై జాలి చూపిస్తూనే ఉంది. తాజాగా పాక్ లోని క్వెట్టాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీసు శిక్షణ కేంద్రం పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో అరవై మంది చనిపోయారు. దీనిపై భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ఆ ...

Read More »

పాకిస్తాన్ తో ఆ డీల్ వాస్త‌వ‌మే: చైనా

pakistan-with-china

చైనాకు కావ‌ల‌సిన దేశాల్లో పాకిస్తాన్ ఒక‌టి. పాక్‌ నుంచి ‘స‌బ్ మెరైన్లు’ విక్ర‌యించేందుకు తమకు ఉన్న ఒప్పందం వాస్త‌వ‌మేన‌ని చైనా అంగీక‌రించింది. ఈ మేరకు చైనా మిలిటరీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఒప్పందానికి చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ‘హు వెన్మింగ్’ అంగీకరించినట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది. పాకిస్థాన్ కు 8 ‘ఎటాక్ సబ్ మెరైన్ల’ విక్రయానికి సంబంధించి సుమారు 5 బిలియన్ డాలర్లతో బీజింగ్ మిలిటరీ కుదుర్చుకున్న అతిపెద్ద ...

Read More »
[X] Close