[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » జయలలితకు భారతరత్న..?..15 కోట్లతో అమ్మ కు మందిరం

జయలలితకు భారతరత్న..?..15 కోట్లతో అమ్మ కు మందిరం

Tamil Nadu cabinet adopts resolution demanding Bharat Ratna to Jayalalithaa

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.  తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అమ్మకు భారతరత్న ఇవ్వా లని  ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రప్రభుత్వానికి ఓ తీర్మానాన్ని పాస్ చేసింది. దీంతో పాటే.. 15 కోట్లతో అమ్మ స్మారక మందిరాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అమ్మ మరణాంతరం తొలిసారి భేటీ అయిన కొత్త కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లోపల కూడా అమ్మ కాంస్య విగ్రహాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. మెరీనా బీచ్ లో నిర్మించిన ఎంజీఆర్ మెమోరియల్ పేరును భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ గా మార్చనున్నట్టు తెలిపింది.అక్కడే జయలలిత మెమోరియల్ ను నిర్మించనున్నట్టు కేబినెట్ పేర్కొంది. అమ్మ మరణాంతరం వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు 31 మంది కొత్త మంత్రులచే కూడా ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణం చేయించారు. తాజాగా పన్నీర్ సెల్వం నేతృత్వంలో కేబినేట్ తొలిసారి సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో అమ్మ జయలలితకు అందరూ శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు, పలు తీర్మానాలను ఆమోదించారు.

Loading...
[X] Close