[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » అమ్మ తర్వాత చిన్నమ్మ??..అమ్మ పార్టీ ఎవరి చేతిలోకి

అమ్మ తర్వాత చిన్నమ్మ??..అమ్మ పార్టీ ఎవరి చేతిలోకి

Tamil Nadu Politics after Jayalalithaa Death

జయలలిత మరణం తర్వాత ఎఐడిఎంకే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే చర్చ జరుగుతూనే ఉంది. కాగా శనివారం నాడు ఈ కీలకమైన అంశంపై రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారనే వార్తలు వెలువడ్డాయి. దీంతో పార్టీ సీనియర్‌ నేత పొన్నియన్‌ ప్రధాన కార్యదర్శి పదవి ఎవ్వరికీ ఇవ్వలేదని…పుకార్లను నమ్మవద్దంటూ ప్రకటించారు. ఈలోపు పార్టీకి చెందిన మరికొందరు సీనియర్‌ నేతలు పొయస్‌ గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిశారు. పార్టీ భవిష్యత్‌ దృష్ట్యా ప్రధానకార్యదర్శి పదవిని స్వీకరించాలని శశికళను కోరారు. ఆమె మాత్రమే జయ లేని లోటును పూడ్చగలదని చెప్పారు. వీరి విజ్ఞప్తిని విన్న శశికళ మౌనంగానే ఉండిపోయారని తెలిసింది. ఈ విషయంలో సీనియర్‌ నాయకులంతా ఒకే మాట మీద ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో పోయస్‌ గార్డెన్‌ వద్దకు కొంతమంది శశికళ వ్యతిరేకులైన అన్నా డిఎంకే కార్యకర్తలు చేరుకొని ముట్టడికి ప్రయత్నించారు. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శశికళకు పార్టీ పగ్గాలు ఇవ్వొద్దంటూ ఆందోళన నిర్వహించారు. దీనిపై స్పందించిన శశికళ పార్టీని చీల్చే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠం మీద  శశికళ కూర్చోవడం లాంఛనమే అంటున్నారు.  అన్నాడీఎంకే పార్టీ అధినేతగా శశికళ ఎన్నికయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది. నాయకత్వం కోసం కుమ్ములాట ఏదీ జరగడం లేదని, సీఎంతో సహా పార్టీ నేతలు శశికళను కలుసుకోవడంలో ఎలాంటి తప్పులేదని సంస్థాగత కార్యదర్శి సీ పొన్నయ్యన్ చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఆమెకు మాత్రమే పార్టీని నడిపించే సత్తా ఉందని సెంగోటయ్యన్ వంటి సీనియర్ నేతలు బాహాటంగానే శశికళకు మద్దతు తెలుపుతున్నారు.  పార్టీలోని మహిళ నేతలు శశికళవైపే ఉన్నారు.   అమ్మలో చిన్నమ్మను చూస్తున్నామని వారంతా చెప్తున్నారు. ఇక శశికళ చేతికి అన్నాడీఎంకే పార్టీపగ్గాలు అప్పగించాలని సీనియర్ నేతలు కోరుకుంటున్నారని ట్విట్టర్ సందేశంలో పేర్కొనడం విశేషం. ఈ నేపధ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉంది. ఈనెలలో ఈ సమావేశం జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Loading...
[X] Close