[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » రాజకీయాలు » అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ లో టీడీపీ ఎమ్మెల్యే

అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ లో టీడీపీ ఎమ్మెల్యే

TDP Leaders Recording Dance with Girls in New Year Celebrations

న్యూ ఇయర్ సంబరాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే బాబురావు ఊగిపోయారు. న్యూఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్‌లో అమ్మాయిలతో కలిసి చిందేశారు. కదిలేందుకు శరీరం అనుకూలించకపోయినా అమ్మాయిలు స్టేజ్ మీద ఉండడంతో స్టెప్పులు అదరగొట్టేందుకు మ్యాగ్జిమన్ ట్రై చేశారు ఈ ఎమ్మెల్యే గారు. లుంగీ డ్యాన్స్ కోసం ప్రయత్నించి పంచె ఎత్తి చూపించారు. ఎమ్మెల్యే బాబురావుతో పాటు లోకల్ టీడీపీ నాయకులు స్టేజ్‌ మీద తైతక్కలాడారు.

తాము బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న విషయం మర్చిపోయి ఎమ్మెల్యే కూడా ఇలా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయ‌డంతో పాటు అక్క‌డున్న వారిని ఎంక‌రేజ్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ తతంగాన్నంతా వీక్షించిన సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.. ‘ఎమ్మెల్యే’ డాన్స్ చూసిన ఇంకొందరైతే ఏకంగా… ఒక టికెట్ పెట్టేసుంటే వచ్చే కలెక్షన్లతో..’బాబు గారు’ AP రాజధానిని సింగపూర్ గా మార్చేయచ్చని సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుకుంటున్నారు.

Loading...
[X] Close